Vikram Movie: విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ వదులుకున్నది ఎవరంటే..
పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి... ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో అదరగొట్టేశారు హీరో సూర్య. గతేడాది ఈ రోల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. సినీ ప్రియులను ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్.. కమల్ హాసన్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి… ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో అదరగొట్టేశారు హీరో సూర్య. గతేడాది ఈ రోల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. సినీ ప్రియులను ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్లకు క్రాస్ చేసిందీ మూవీ. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్.. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో లియో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ కాంబో రిపీట్ కాబోతుంది. అయితే తాజాగా విక్రమ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.
విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి నటించిన సంతానం పాత్రకు ముందుగా రాఘవ లారెన్స్ ను ఎంపిక చేశారట. అయితే అప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న లారెన్స్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ అవకాశాన్ని వదులుకున్నారట. ఇదే విషయాన్ని ఇటీవల రుద్రుడు ప్రమోషన్లలో బయటపెట్టారు లారెన్స్. అలాగే డైరెక్టర్ లోకేష్ తో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే.. లారెన్స్ నటిస్తోన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కు దర్శకుడు రత్నకుమార్. అయితే ఈ సినిమాకు లోకేష్ కథ.. స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది.




ఇక ఇటీవల లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన రుద్రుడు సినిమా రెండు రోజుల క్రితం థియేటర్లలో విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ రివెంజ్ డ్రామాకు కతిరేషన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుందీ సినిమా.