Pawan Kalyan Watch: పవన్‌ వాచ్‌ దొరికితే చాలు.. లక్షధికారి అవ్వొచ్చు

ఏదైనా.. ఈవెంట్స్‌లోనో.. సెలబ్రేషన్స్‌లోనో.. పార్టీస్‌లోనో.. గ్యాదరింగ్స్‌లోనో.. అప్పుడప్పుడూ..సెలబ్రిటీల కంటే..వారి యాక్ససెరీసే అందర్నీ అట్రాక్ట్ చేస్తుంటాయి. అందర్నీ చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. ఉండబట్టలేక ఆరా తీసేలా కూడా చేస్తుంటాయి. ఇక తాజాగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ చేతికున్న వాచ్

Updated on: Jul 28, 2023 | 9:50 AM

ఏదైనా.. ఈవెంట్స్‌లోనో.. సెలబ్రేషన్స్‌లోనో.. పార్టీస్‌లోనో.. గ్యాదరింగ్స్‌లోనో.. అప్పుడప్పుడూ..సెలబ్రిటీల కంటే..వారి యాక్ససెరీసే అందర్నీ అట్రాక్ట్ చేస్తుంటాయి. అందర్నీ చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. ఉండబట్టలేక ఆరా తీసేలా కూడా చేస్తుంటాయి. ఇక తాజాగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ చేతికున్న వాచ్ కూడా.. ఇలాగే చాలా మందిని టెంప్ట్ చేసింది. గూగుల్ చేసేలా ఆ వాచ్ గురించి ఆరా తీసేలా చేసుకుంటే.. దాని ఖరీదు చూసి అందరూ ఖంగు తినేలా చేసింది. ఎస్ ! వాచ్‌లంటే.. షూలంటే.. హుడీస్‌ అంటే.. కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూసించే పవర్ స్టార పవన్‌ కళ్యాణ్‌.. చాలా ఖరీదైన వాచ్‌లనే క్యారీ చేస్తుంటారు. మంచి కలెక్షన్స్‌ను కూడా మెయిన్‌ టేన్‌ చేస్తున్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రంలోనే బ్రో ఈవెంట్లో తన చేతికున్న వాచ్‌ కారణంగా.. దాని రేట్‌ కారణంగా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.

ఇక పవన్ పెట్టుకున్న వాచ్‌ విషయానికి వస్తే.. దాని పేరు.. బ్రెగ్యుట్‌ మైరెన్‌ క్రోనోగ్రాఫ్‌. ఇది వరల్డ్ లోనే వన్‌ ఆఫ్‌ ది కాస్లీయెస్ట్ వాచ్‌. దీని ప్రైజ్‌ దాదాపు 21 లాక్స్‌ 45 థౌజెండ్‌.. 678 రూపీస్. ఏంటి రేట్‌ తెలుసుకుని షాకయ్యారు. మీరే కాదు.. ఈ వాచ్‌ రేట్ తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ షాకవుతున్నారు. నోరెళ్ల బెడుతున్నారు. గూగుల్తో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్‌ చేసుకుంటున్నారు. ఇక ఆ స్క్రీన్‌ షార్ట్‌నే సోష్ల మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అక్షరాలా 21లక్షలా.. ఏందయ్యా ఇది వాచా.. బంగామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్‌ వాచ్‌ దొరికితే చాలు.. డూప్లెక్స్ ఇల్లు వచ్చినట్టే అని ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. దాంతో పాటే.. పవన్‌ అత్తారింటికి దారేది సినిమాలోని.. వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది అనే డైలాగ్‌ను.. ఆ సీన్‌ను గుర్తు చేసుకుంటున్నారు.