AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pokiri: పోకిరి సినిమా మిస్ చేసుకున్నందుకు ఈ హీరోయిన్ ఇప్పటికీ ఫీల్ అవుతుందట.. ఆమె ఎవరంటే

ఒక్కడు తర్వాత నిజం, నాని, అర్జున్, అతడు సినిమాలు చేశారు మహేష్. వీటిలో అర్జున్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అతడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆతర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. మహేష్ బాబు యాక్టింగ్.. పూరిజగన్నాథ్ డైరెక్షన్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. పోకిరి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది.

Pokiri: పోకిరి సినిమా మిస్ చేసుకున్నందుకు ఈ హీరోయిన్ ఇప్పటికీ ఫీల్ అవుతుందట.. ఆమె ఎవరంటే
Pokiri
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2023 | 10:13 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది పోకిరి. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక్కడు సినిమాతర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అదే సమయంలో వచ్చింది పోకిరి సినిమా. ఒక్కడు తర్వాత నిజం, నాని, అర్జున్, అతడు సినిమాలు చేశారు మహేష్. వీటిలో అర్జున్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అతడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆతర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. మహేష్ బాబు యాక్టింగ్.. పూరిజగన్నాథ్ డైరెక్షన్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. పోకిరి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే పోకిరి సినిమాకు ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట పూరి. ఈ డైనమిక్ డైరెక్టర్ ఎక్కువగా తన సినిమాల్లో బాలీవుడ్ భామలు ఉండేలా చూస్తారు. ఈ క్రమంలోనే పోకిరి సినిమాకు కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఆకున్నారట. ఆమె మరెవరో కాదు కంగనా రనౌత్. పోకిరి సినిమాలో ముందుగా కంగనా రనౌత్ ను హీరోయిన్ గా అనుకున్నారట దర్శకుడు పూరిజగన్నాథ్.

పోకిరి సినిమాకోసం తనను సంప్రదించినప్పుడు గ్యాంగ్ స్టార్ అనే సినిమా చేస్తుందట కంగనా.. దాంతో పోకిరి సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాలేదని తెలిపింది. ఆవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ అయ్యాను అని తెలిపింది కంగనా..ఇప్పటికీ పోకిరి సినిమాను మిస్ చేసుకున్నందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా అని తెలిపారు కంగనా. ప్రస్తుతం కంగనా రనౌత్ చంద్రముఖి 2లో నటిస్తుంది. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 సినిమా రిలీజ్ కానుంది.

కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?