CIMER KGF: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్.. ఎంబీబీఎస్ విద్యకు కేరాఫ్ అడ్రస్..
బెంగళూరుకు సమీపంలోని చెట్టినాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (CIMER), KGF మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎంబీబీఎస్ విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎంబీబీఎస్ చదవాలనుకునేవారికి మెరుగైన విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆ తర్వాత గ్రామాల్లో సేవలు వంటి అవకాశాలు అందిస్తోంది.

20 ఏళ్ల అనుభవంతో ఐదు ముఖ్యమైన లక్ష్యాలు
చెట్టినాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (CIMER), KGF తన ఎంబీబీఎస్ (MBBS) కోర్సును ఐదు ముఖ్యమైన అంశాలే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. మంచి చదువు, ప్రాక్టికల్ శిక్షణ, పరిశోధన, రోగుల సేవ, సమాజానికి సహాయం చేయడం వంటి అంశాలే ప్రధానంగా తీసుకుని కోర్సును రూపొందించింది. లక్ష్యాలను చెప్పుకోవడం సులభమే.. కానీ ఈ సంస్థకున్న మంచి పేరు ఆ లక్ష్యాలను సాధిస్తూ తన సత్తాను చాటుకుంటోంది. గత 20 ఏళ్లకుపైగా మెడికల్ విద్య, వైద్య సేవలు, రీసెర్చ్ రంగంలో చెట్టినాడు అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (CARE) సాధిస్తున్న విజయాలే దానికి ఊదాహరణగా చెప్పవచ్చు. CARE సంస్థను UGC “కేటగిరీ I” డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించింది. ఇదేకాకుండా NIRF 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోని యూనివర్సిటీలలో టాప్ 61వ స్థానంలో నిలిచింది. చెన్నై సమీపంలోని కేళంబాక్కంలో ఉన్న మెడికల్ కాలేజీ దేశంలోని టాప్ 50 కాలేజీలలో ఒకటిగా పేరు పొందింది. NAACలో 4 పాయింట్లకు గాను 3.71 మార్కులతో అత్యున్నతమైన A++ గ్రేడ్ సాధించింది.
బెంగళూరుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో CIMER కాలేజీ ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కొత్త సిలబస్ ప్రకారం.. ఏటా 100 మంది MBBS విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తోంది. ఈ క్యాంపస్‌లో అన్ని విభాగాలతో కూడిన పెద్ద హాస్పిటల్, డమ్మీ బొమ్మలతో ప్రాక్టీస్ చేసే సిమ్యులేషన్ ల్యాబ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా నర్సింగ్, ఫిజియోథెరపీ, అలైడ్ హెల్త్ కాలేజీలు కూడా ఇదే క్యాంపస్‌లో ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. ఇక్కడ చదివే విద్యార్థులకు డిగ్రీలను CARE యూనివర్సిటీయే అందిస్తోంది. CARE మంచి ప్రమాణాలను ఏర్పాటు చేస్తే.. CIMER వాటిని నేరుగా అమలు చేస్తుంది. అయితే CIMER వద్ద ఆ ఐదు లక్ష్యాలు ఎలా అమలవుతున్నాయో కింద చూద్దాం.
CIMER గురించి..
CIMER కొత్తగా మొదలైనది కాదు.. చాలా కొత్త మెడికల్ కాలేజీలు తమ భవిష్యత్తును నమ్మమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. కానీ CIMER మాత్రం వందేళ్ల అనుభవంతో ముందుకు వచ్చింది. CARE సంస్థలో ఒక భాగంగా ఉంటూ ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పద్ధతులను కొనసాగిస్తోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, BEML నగర్, D.K. ప్లాంటేషన్‌కు తన సేవలను విస్తరించింది. CAREకు మొత్తం ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. తమిళనాడులో కేళంబాక్కం, కల్పాక్కం, కరూర్, కానాడుకాతన్ క్యాంపస్‌లు ఉండగా.. కర్ణాటకలో KGF క్యాంపస్ ఉంది. తమిళనాడు బయట ఈ యూనివర్సిటీకి ఉన్న ఒకే ఒక్క క్యాంపస్ KGF ఒక్కటే. ఈ యూనివర్సిటీని UGC కేటగిరీ I సంస్థగా గుర్తించింది. UGC చట్టం 1956 లోని సెక్షన్ 12(B) కింద ఈ గుర్తింపు లభించింది. అంతేకాకుండా కేంద్ర సైన్స్ శాఖ నుండి SIRO (సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) హోదా కూడా దక్కించుకుంది. అలాగే ఇక్కడి కోర్సులకు NMC (నేషనల్ మెడికల్ కమిషన్), INC (నర్సింగ్ కౌన్సిల్), AICTE, COA (ఆర్కిటెక్చర్ కౌన్సిల్), BCI (బార్ కౌన్సిల్), PCI (ఫార్మసీ కౌన్సిల్) వంటి అన్ని ప్రభుత్వ విభాగాల అనుమతులు ఉన్నాయి. పచ్చదనం, పరిశుభ్రతలో (UI GreenMetric) CARE మన దేశంలోనే 9వ స్థానంలో నిలిచింది. చెన్నైలోని కేళంబాక్కంలో ఉన్న చెట్టినాడు హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CHRI) దీని ప్రధాన క్యాంపస్. ఇక్కడ 4698 మంది విద్యార్థులు 84 రకాల కోర్సులు చదువుతున్నారు.
CIMER ప్రత్యేకతలు ఏంటి..?
CIMER ప్రతి సంవత్సరం 100 మంది MBBS విద్యార్థులను మాత్రమే అడ్మిషన్ కల్పిస్తోంది. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టడం కోసమే తక్కువ మందికి అడ్మిషన్ ఇస్తున్నారు. క్యాంపస్ వసతులు NMC నిబంధనల ప్రకారం ఉంటాయి. అత్యాధునిక క్లాస్ రూమ్స్, పూర్తి ల్యాబ్‌లు, క్యాంపస్ మొత్తం వై-ఫై, అతి పెద్ద లైబ్రరీ, ఏసీ ఆడిటోరియం వంటి సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి అన్ని విభాగాల పెద్ద హాస్పిటల్‌తో పాటు గ్రామాలు, పట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాలు కూడా ఉన్నాయి. మెడికల్ విద్య, వైద్య సేవలు, రీసెర్చ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న ఈ సంస్థ ఇప్పుడు కర్ణాటక విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది.
KGF ఎందుకు? ఏడు నిజాలు ఇవే..
1.మెరుగైన సిలబస్: మొదటి సంవత్సరం నుంచే ఆసుపత్రి అనుభవం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పవచ్చు. చాలా మెడికల్ కాలేజీలలో తొలి ఏడాదిలో విద్యార్థులకు రోగులను చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ఆలస్యమవుతుంది. కానీ CIMER పద్ధతి వేరు. NMC తెచ్చిన కొత్త పద్ధతి (CBME) ప్రకారం విద్యార్థులకు మేలు చేస్తోంది. తొలి ఏడాది నుంచే క్లినికల్ ట్రైనింగ్ (Early Clinical Exposure) ఇస్తోంది. దీనివల్ల పుస్తకాల్లో చదివిన చదువును ఆసుపత్రిలో రోగులను చూస్తూ వెంటనే సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ సొంత టీచింగ్ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ (ICU), ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ వార్డులు, బ్లడ్ బ్యాంక్, టెస్టింగ్ ల్యాబ్‌లు, స్కానింగ్ మిషన్లు, ఇన్-పేషెంట్, ఔట్-పేషెంట్ విభాగాలు ఉంటాయి. చెట్టినాడు సిమ్యులేషన్ అండ్ స్కిల్ సెంటర్ (CSSC)లో మనుషుల్లాగే ఉండే పెద్ద, చిన్న పిల్లల బొమ్మలు ఉంటాయి. రోగులకు నేరుగా వైద్యం చేసే కంటే ముందే విద్యార్థులకు ఈ బొమ్మలపై అన్ని రకాల వైద్య పద్ధతులను నేర్చుకోవచ్చు. అలాగే CARE డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు చదువుకోవడానికి 1,84,862కు పైగా ఈ-బుక్స్, 9,195 ఈ-జర్నల్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
2.చదువుతో పాటే పీజీ కోచింగ్
చాలామంది విద్యార్థులకు MBBS డిగ్రీ అనేది మొదటి అడుగు మాత్రమే. పీజీ (PG) ఎంట్రన్స్ పరీక్షలే ఒక డాక్టర్ ఏ స్పెషాలిటీ తీసుకోవాలో నిర్ణయిస్తాయి. కానీ చాలామంది విద్యార్థులు దీని ప్రిపరేషన్‌ను చాలా ఆలస్యంగా మొదలుపెడతారు. CIMERలో MBBS చదువుతో పాటే పీజీ కోచింగ్‌ను కూడా కలిపి అందిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలు, వైద్య రంగంలో మంచి అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో CARE ప్రత్యేక కోచింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ఆఖరి సంవత్సరం సిలబస్‌లోనే ముఖ్యమైన పాఠాలు, క్లినికల్ కేసుల స్టడీ, ప్రస్తుత పరీక్షల పద్ధతిలో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. విద్యార్థుల చదువును బట్టి ప్రత్యేక శ్రద్ధ, వెనుకబడిన వారికి అదనపు క్లాసులు ఉంటాయి. వారాంతాల్లో కాలేజీ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా క్లాసులు నడుపుతారు. దీనివల్ల విద్యార్థులు MBBS పూర్తయ్యే వరకు ఆగకుండా, చదువుకుంటూనే తమ పీజీ లక్ష్యానికి కూడా సిద్ధం కావచ్చు.
3.AIIMS, PGIMER, JIPMER నిపుణులతో క్లాసులు
బోధించే అధ్యాపకులను బట్టే విద్యార్థుల నాలెడ్జ్ పెరుగుతుంది. CIMER లో ఉండే రెగ్యులర్ టీచర్లతో పాటు, దేశంలోనే టాప్ సంస్థలైన AIIMS, PGIMER, JIPMERకు చెందిన ప్రముఖ డాక్టర్లతో ప్రతి వారం ప్రత్యేక మాస్టర్‌క్లాసులు నిర్వహిస్తారు.

CIMER
4.అందరికీ అందుబాటులో వైద్యం: ప్రజలకు మేలు, విద్యార్థులకు మంచి ప్రాక్టీస్
డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని పేద రోగులకు CIMERలో నాణ్యమైన సర్జరీలు సరసమైన ధరలు లేదా తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. సమాజంలోని అందరికీ మంచి వైద్యం అందించాలనే యూనివర్సిటీ ఆశయానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు పేద ప్రజలకు మేలు చేస్తూనే.. మరోవైపు సీనియర్ సర్జన్ల పర్యవేక్షణలో విద్యార్థులు ఎన్నో రకాల సర్జరీలను దగ్గరుండి చూసి నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది రోగులు వచ్చే ఆసుపత్రుల్లో విద్యార్థులకు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
5.ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్: ఆసుపత్రి దాటి బయటి ప్రపంచంలో వైద్యం
ఆరోగ్యం అనేది కేవలం ఆసుపత్రుల్లో ఇచ్చే మందులు, ఆపరేషన్లపైనే కాకుండా.. రోగులు ఉండే ఇళ్లు, గ్రామ వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ (FAP) ద్వారా ఈ విషయాన్ని విద్యార్థులు ఈ కాలేజీ ద్వారా నేర్చుకోవచ్చు. మెడికల్ విద్యార్థులు గ్రామాల్లో లేదా వెనుకబడిన ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలను కొన్నాళ్ల పాటు దత్తత తీసుకుంటారు. దీనివల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు తీరడమే కాకుండా.. విద్యార్థులకు సమాజంపై బాధ్యత పెరుగుతుంది. పేదరికం, అలవాట్లు, పరిసరాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో విద్యార్థులు స్వయంగా అర్థం చేసుకుంటారు. రోగిని కేవలం ఒక రోగిలా కాకుండా.. ఒక కుటుంబంలో, సమాజంలో భాగంగా చూడటం నేర్చుకుంటారు.
6.పూర్తి రక్షణ, భద్రత, పచ్చని క్యాంపస్
మెడికల్ కాలేజీని ఎంచుకునేటప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. CIMER లో భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.
పూర్తి భద్రత: క్యాంపస్‌లో విద్యార్థులకు 24 గంటల పాటు నిరంతరం భద్రత ఉంటుంది. నిరంతరం సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుండటంతో పాటు సెక్యూరిటీ సిబ్బంది పహారా ఉంటుంది. గుర్తింపు కార్డుతో తెరుచుకునే ప్రత్యేక గేట్లు ఉంటాయి.(ప్రత్యేక బులిటెన్)
పచ్చని వాతావరణం: కాలుష్యం లేని, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.
హాస్టల్ వసతి: అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా సురక్షితమైన హాస్టళ్లు ఉన్నాయి. హాస్టళ్లలో టీవీ, వై-ఫై, లాండ్రీ, జిమ్, ఆట స్థలాలు ఉన్నాయి.
ర్యాగింగ్ లేని కాలేజీ: ఇక్కడ ర్యాగింగ్ పూర్తిగా నిషేధం. ఇతర రాష్ట్రాలు, విభిన్న ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులను ఆదరిస్తూ, సీనియర్లు, లెక్చరర్లు వారికి మంచి మార్గదర్శకులుగా ఉంటారు.

CIMER
7.ఆలోచించాల్సిన నిజాలు
ఒక మెడికల్ కాలేజీ ఎంత మంచిదో దాని పాత రికార్డులను బట్టి చెప్పవచ్చు. దేశంలో 61వ ర్యాంక్, మెడికల్ విభాగంలో 49వ ర్యాంక్, NAAC అత్యున్నత A++ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీ అండ CIMER, KGFకు ఉంది. దీనికి తోడు మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్, చదువుతో పాటే పీజీ కోచింగ్, AIIMS, PGIMER, JIPMER డాక్టర్లతో క్లాసులు, అన్ని వసతులు ఉన్న సురక్షితమైన పచ్చని క్యాంపస్ ఇక్కడ ఉన్నాయి.మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ విషయాలు ఎంతో ఉపయోగపడతాయి.
“చదువు మొదలుపెట్టాలనుకునే విద్యార్థులకు CIMER, KGF ఇచ్చే నమ్మకం కేవలం మాటల మీద కాదు, అది ఇప్పటికే చేసి చూపించిన పనుల మీద ఆధారపడి ఉంది.”
