AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: మీరు కొనేది అసలైన వెండినా? లేదా నకిలీదా..? సింపుల్‌గా ఇట్టే పసిగట్టేయొచ్చు.. ఈ ఒక్కటి తెలిస్తే చాలు..

దీపావళి పండక్కి సిల్వర్ కొంటున్నారా.. పూజా సామాగ్రి, కాయిన్స్, పాత్రల రూపంలో వెండి కొనుగోలు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే నకిలీ లేదా నాసిరకం వెండిని మీకు కట్టబెట్టే అవకాశముంటుంది. ప్రస్తుతం వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Silver: మీరు కొనేది అసలైన వెండినా? లేదా నకిలీదా..? సింపుల్‌గా ఇట్టే పసిగట్టేయొచ్చు.. ఈ ఒక్కటి తెలిస్తే చాలు..
Silver
Venkatrao Lella
|

Updated on: Oct 31, 2026 | 11:15 AM

Share

దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది. మరో కొద్ది రోజుల్లోనే పండుగ వచ్చేస్తోంది. దీపావళి అంటేనే దేశంలో ప్రతీఒక్కరూ జరుపుకునే అత్యంత ప్రధానమైన పండుగ. ఈ పండక్కి పసిడి కొంటే శుభపద్రమని చాలామందిలో నమ్మకం ఉంది. దీంతో బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పూజా సమాగ్రి, దేవుడి ప్రతిమలు, కాయిన్స్, ఇంట్లో ఉపయోగించే పాత్రల రూపంలో వెండి కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగోల చేసే సమయంలో నకిలీ వస్తువుల రూపంలో మోసానికి గురయ్యే అవకాశముంటుంది. దీంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగారంలాగే వెండికి కూడా హాల్‌మార్క్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వినియోగదారులు మోసకుండా స్వచ్చమైన నిజమైన వెండిని కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా కొనుగోలు చేసేటప్పుడు అది అసలైనదే.. నకిలీదో ఎలా తెలుసుకోవాలి?

స్వచ్చతను గుర్తించడం ఎలా..?

బంగారం స్వచ్చతను 24, 22,18 క్యారెట్ల రూపంలో నిర్దారించినట్లుగానే.. వెండి స్వచ్చతను 999,925,880 వంటి సంఖ్యలతో గుర్తించవచ్చు. ఒక్కొ రకం వెండిని ఒక్కొ వస్తువు తయారుచేయడానికి వినియోగిస్తారు. దీంతో మీరు ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడం ద్వారా నకిలీ లేదా నాసిరకమై వెండిని కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడవచ్చు.

-మీరు కొనుగోలు చేసే వెండి 999 స్వచ్చత కలిగినది అయితే.. 99.9 శాతం స్వచ్చతమైన వెండి ఉంటుది. దీనిని ఎక్కువగా కాయిన్స్, కడ్డీలు, పెట్టుబడి ప్రయోజనాల కోసం వినియోగిస్తారు

– 925 క్వాలిటీతో కూడుకున్న సిల్వర్‌లో 92.5 శాతం ఫ్యూర్ వెండి ఉంటుంది. వీటిల్లో రాగి లాంటి ఇతర లోహలు కలుపుతారు. ఆభరణాల కోసం ఈ స్వచ్చత కలిగిన వెండిని ఉపయోగిస్తారు. ఇతర లోహలు కలడపం వల్ల ఆభరణాలు బలంగా, వాడటానికి సులభంగా ఉంటాయి

-ఇక 800 స్వచ్చతతో కూడుకున్న వెండిలో 80 శాతం మాత్రమే వెండి ఉంటుంది. వీటిని కాలి గజ్జెలు, పూజా సామాగ్రి కోసం వినియోగిస్తారు

స్వచ్చమైన వెండిని ఎలా గుర్తించాలి..?

స్వచ్చమైన వెండి బాగా మృదువుగా ఉంటుంది. గీతలు పడటం, వంగిపోవడం, వక్రీకరణకు ఎక్కువగా గురవుతుంది. మీరు కొనుగోలు చేసేముందు హాల్ మార్క్ తనిఖీ చేయాలి. బీఐఎస్ కేర్ యాప్‌లోకి వెళ్లి హాల్ మార్క్ తనిఖీ చేయాలి. మీరు కొనే సిల్వర్‌పై ఉండే ఆరు అంకెల కోడ్‌ను యాప్‌లో నమోదు చేయాలి. దీంతో మీరు కొనే వెండికి సంబంధించిన వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిల్వర్‌కు హాల్ మార్క్ నిబంధన తప్పనిసరి చేయలేదు. కేవలం ఆప్షనల్ చేసింది. అయితే హాల్ మార్క్ ఉన్న సిల్వర్ కొనుగోలు చేయడం వల్ల మోసాల నుంచి బయటపడవచ్చు. పండుగ సమయాల్లో సిల్వర్ కొనుగోలు చేస్తుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Follow Us
బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు?దీని వెనుక ఉన్న కారణాలివే
బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు?దీని వెనుక ఉన్న కారణాలివే
ఆక్వా రంగంపై అర్నబ్ ఎఫెక్ట్.. కన్నీరుమున్నీరవుతున్న రొయ్యల రైతులు
ఆక్వా రంగంపై అర్నబ్ ఎఫెక్ట్.. కన్నీరుమున్నీరవుతున్న రొయ్యల రైతులు
స్వచ్చమైన వెండిని గుర్తించడం ఎలా..? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు
స్వచ్చమైన వెండిని గుర్తించడం ఎలా..? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు
నాకు చెప్పిన కథ ఒకటి.. తీసింది మరోకటి.!
నాకు చెప్పిన కథ ఒకటి.. తీసింది మరోకటి.!
చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ రసం.. ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ రసం.. ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
ఎంబీబీఎస్: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్..
ఎంబీబీఎస్: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్..
రూ.100కి చేరిన బియ్యం ధర.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అదే జరిగితే..
రూ.100కి చేరిన బియ్యం ధర.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అదే జరిగితే..
ఒకే రోజు మూడు సీజన్‌ల వాతావరణం.. ఎక్కడో తెలుసా
ఒకే రోజు మూడు సీజన్‌ల వాతావరణం.. ఎక్కడో తెలుసా
షుగర్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. ఉదయాన్నే రెండు బిల్వ ఆకులు తింటే
షుగర్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. ఉదయాన్నే రెండు బిల్వ ఆకులు తింటే
రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాస్టిక్ నోట్లు..
రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాస్టిక్ నోట్లు..