Godavari: ఫీల్ గుడ్ మూవీ గోదావరి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఆయన సినిమాల్లో ఎదో తెలియాని మ్యాజిక్ ఉంటుంది. అలా సినిమా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మన పక్కింట్లోనో.. లేక మన వీధిలోనో జరిగే కథల్లా ఉంటాయి ఆయన సినిమాలు. శేఖర్ తెరపైకేక్కించిన మధురమైన సినిమాల్లో గోదావరి సినిమా ఒకటి సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. మనసుకు హాయిగా అనిపించే సినిమాలు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో ఎదో తెలియాని మ్యాజిక్ ఉంటుంది. అలా సినిమా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మన పక్కింట్లోనో.. లేక మన వీధిలోనో జరిగే కథల్లా ఉంటాయి ఆయన సినిమాలు. శేఖర్ తెరపైకేక్కించిన మధురమైన సినిమాల్లో గోదావరి సినిమా ఒకటి సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చక్కటి కథాంశంతో అందంగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను.. 2006 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో సుమంత్ కు జోడీగా కమలిని ముఖర్జీ నటించారు. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు.
గోదావరి సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలై 17 ఏళ్ళు అవుతోంది. 2006 మే 19న రిలీజ్ అయ్యింది గోదావరి సినిమా. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కె.ఎం.రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు గోదావరి సినిమాకు ముందుగా సుమంత్ ను హీరోగా అనుకోలేదట.
గోదావరి సినిమాను మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు మాస్ మహారాజ రావితేజ. మాయా సినిమాలతో పాటు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లాంటి ఫీల్ గుడ్ సినిమాలు కూడా చేసి మెప్పించారు రావితేజ. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా చూసిన తర్వాత శేఖర్ కమ్ముల గోదావరి సినిమాకి రవితేజ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ అప్పటికే ఆయన ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో.. సుమంత్ ను హీరోగా తీసుకున్నారట శేఖర్ కమ్ముల.