ఏంటీ ..! సాయి పల్లవి ఆ స్టార్ హీరోయిన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిందా..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సాయి పల్లవి సడన్ గా సినిమాల జోరు తగ్గించింది. మొన్నటి వరకు గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది..
టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సాయి పల్లవి సడన్ గా సినిమాల జోరు తగ్గించింది. మొన్నటి వరకు గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది. మలయాళ, తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన సాయి పల్లవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సాయి పల్లవికి సంబందించిన ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే సాయి పల్లవి సినిమాల్లోకి రాక ముందు ఢీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. సాయి పల్లవికి డాన్స్ అంటే చాలా ఇష్టం సినిమాల్లోనూ సాయి పల్లవి తన డాన్స్ లతో అదరగొడుతోంది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు సాయి పల్లవి ఓ సినిమాలో సైడ్ రోల్ లో నటించిన విషయం మీకు తెలుసా.?
అవును సాయి పల్లవి హీరోయిన్ గా కంటే ముందు సైడ్ యాక్టర్ గా ఓ సినిమాలో కనిపించింది. అది కూడా ఓ స్టార్ హీరోయిన్ సినిమాలో.. బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ధామ్ ధూమ్ అనే సినిమాలో సాయి పల్లవి చిన్న పాత్రలో నటించింది. జయం రవి ఈ సినిమాలో హీరో.. ఈ చిత్రంలో సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిది. ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.