సినిమాల్లో నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?

27  February 2025

Basha Shek

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని రేంజ్ వేరు. ప్రస్తుతం ఉన్న టైర్- 2 హీరోల్లో టాప్ లో ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఓవైపు దసరా లాంటి ఊరమాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు హాయ్ నాన్న వంటి ఫీల్ గుడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు నాని.

ఇప్పుడు హిట్-3 అంటూ మరో ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు న్యాచురల్ స్టార్. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో అతను కనిపించనున్నాడు.

అంతేకాదు ఈ మూవీలో టోన్డ్ బాడీతో సిక్స్ ప్యాక్ తో కనపించనున్నాడు నాని.  ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

కాగా సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. ఇండస్ట్రీలో అతనికి ఎవరూ గాడ్ ఫాదర్ లేరు.

 నాని అసలు పేరు నవీన్ బాబు గంట. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తరువాత సింపుల్ గా నానిగా మారాడీ హీరో.

ఇండస్ట్రీలోకి రావడమే అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నిసినిమాలకు పనిచేశాడు నాని. బాపు వంటి దిగ్గజాలతో కలిసి పని చేశాడు.

 ప్రస్తుతం సినిమాకు రూ. 25 కోట్లకు పైగా తీసుకుంటోన్న నాని మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జస్ట్ రూ. 4000 మాత్రమే.