
సాధారణంగా హీరోలు, హీరోయిన్లు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక వారు ధరించే దుస్తులు, వారు నడిపే కార్లు, వారు కలిగి ఉన్న బంగ్లాలు అన్నీ చాలా ఖరీదైనవి. సెలబ్రిటీలు ఉపయోగించే ఒకే ఒక్క వాచ్ ధరతో సామాన్యుడు ధనిక జీవితాన్ని గడపవచ్చు. అయితే, కొంతమంది ధనిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అలాగే కొందరు తమ సింపుల్ లైఫ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు ఒక నటి అందరి హృదయాలను గెలుచుకుంది. కోట్ల ఆస్తులు.. లంబోర్గిని కారు ఉన్నప్పటికీ ఆమె ఇప్పుడు చిన్న స్విఫ్ట్ కారులో తిరగడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె మరెవరో కాదు.. శ్రద్ధా కపూర్. ఇటీవల కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ చిన్న కారు వాడుతున్నాడని వార్తలు వచ్చాయి. వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రానికి దర్శకుడు అయినప్పటికీ చిన్న కారులో తిరగడం చూసి షాకయ్యారు.
ఇక ఇప్పుడు శ్రద్ధా కపూర్ అందరి హృదయాలను గెలుచుకుంది.హిందీలో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘సాహో’ చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. భారీ కలెక్షన్లు సాధించి సాహో కొత్త రికార్డు సృష్టించింది. శ్రద్ధా కపూర్ ఇటీవల ‘స్త్రీ 2’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం హిట్ అయింది. ఈ చిత్రం రూ. 900 కోట్లు వసూలు చేసింది. తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో ‘ఆషికి 2’, ‘బాఘి’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘స్త్రీ’ వంటి చిత్రాల్లో నటించిన శ్రద్ధా, సాహో చిత్రంలో ప్రభాస్ సరసన మెరిసింది.
ఇదిలా ఉండగా, శ్రద్ధా కపూర్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారును ఉపయోగిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. శ్రద్ధా కపూర్ వద్ద మారుతి సుజుకి స్విఫ్ట్, లంబోర్గిని, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ మూడు మోడళ్లు, ఆడి క్యూ7, టయోటా ఫార్చ్యూనర్ ఉన్నాయని సమాచారం.
Shraddha Kapoor
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..