AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : నలుగురిని ప్రేమించింది.. ముగ్గురిని పెళ్లి చేసుకుంది.. ఇప్పటికీ ఒంటరిగానే.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్..

80లలో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఆమె హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రేమలో విఫలమైంది. 4ని ప్రేమించింది.. మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ ఒంటరిగానే జీవించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : నలుగురిని ప్రేమించింది.. ముగ్గురిని పెళ్లి చేసుకుంది.. ఇప్పటికీ ఒంటరిగానే.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్..
Salma Agha
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2025 | 12:38 PM

Share

80లలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఆమె అనేక హిట్ చిత్రాల్లో కనిపించింది. కానీ వ్యక్తిగత జీవితం అంత సాఫీగా సాగలేదు. నలుగురిని ప్రేమించింది.. మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ చివరకు ఒంటరిగానే రోజులు గడపాల్సి వచ్చింది. మనం మాట్లాడుతున్న హీరోయిన్ పేరు సల్మా ఆఘా. 1982లో విడుదలైన నికా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె నటి మాత్రమే కాదు.. గొప్ప గాయని కూడా. హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. అలాగే అనకే పాటలు పాడింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

‘నికాహ్’ తర్వాత, ఆమె ‘కసమ్ పద కర్నే వాలే కి’, ‘పతి పత్నీ ఔర్ తవైఫ్’, ‘ఫూలన్ దేవి’, ‘కోబ్రా’, ‘ఉంచె లాగ్’ వంటి చిత్రాలలో నటించింది. సినీరంగంలో నటిగా కెరీర్ విజయం సాధించింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిపోయారు. నాలుగుసార్లు ప్రేమలో పడింది. మూడు సార్లు పెళ్లి చేసుకుంది. కానీ ప్రతిసారీ ఆమె ప్రయాణం అంతరాయం కలిగింది. ఆమె న్యూయార్క్ వ్యాపారవేత్త మెహమూద్ సిప్రాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమె పాకిస్తానీ నటుడు మెహమూద్ తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం ఎక్కువ సాగలేదు. ఆ తర్వాత ఆమె నటుడు జావేద్ షేక్ ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

1989లో స్క్వాష్ క్రీడాకారుడు రెహమత్ ఖాన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2010లో విడాకులు చేసుకున్నారు. ల్మా ఆఘా 68 సంవత్సరాల వయసులో జీవిస్తున్నారు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

Salma Agha News

Salma Agha News

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..