ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ‘సలార్’. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ల డైనమిక్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటిరోజే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో డార్లింగ్ యాక్టింగ్.. నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యా్న్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నీల్. ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నీల్.. ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. ఈ సినిమాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రుతిహాసన్ కీలకపాత్రలు పోషించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది హోంబలే ఫిల్స్మ్. విడుదలకు ఎలాంటి ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ లేకుండానే ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. సలార్ విడుదలకు కోసం చాలాకాలంగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది సలార్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
The REBEL STORM has arrived💥
Watch #SalaarCeaseFire at your nearest cinemas! #BlockbusterSalaar #RecordBreakingSalaar#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/ydMfxmzKvw
— Hombale Films (@hombalefilms) December 22, 2023
మొత్తం రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ.100 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. అలాగే లాభాల్లో 10 శాతం షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దాదాపు రూ.50 కోట్లు తీసుకున్నారని టాక్. ఇక ఈ సినిమాలో కథనాయిక ఆద్య పాత్రలో కనిపించిన శ్రుతిహాసన్.. రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. అలాగే కీలకపాత్రలలో నటించిన జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ రూ.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
#SalaarCeaseFire stands as one of the most incredible mass films!
Kudos to Prabhas Sir for his outstanding performance, and a special shoutout to Prithiviraj sir for nailing the role. Big hug to Prashanth Neel for weaving a beautiful story about friendship, and heartfelt…
— Rishab Shetty (@shetty_rishab) December 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.