
నందమూరి బాలకృష్ణ హీరోగా ఊరమాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించగా, మరో కీ రోల్‌లో కాజల్ అగర్వాల్ మెరిసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది చిత్రబృందం. ఈ సందర్భంగానే శ్రీలీలతో తనకున్న బంధుత్వాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రీలీల తనకు వరసకు అక్క కూతురు అవుతుందని చెప్పుకొచ్చిన అనిల్ తాము ఎలా బంధువులమవుతామో కూడా వివరించారు. శ్రీలీలది కర్ణాటక అని చాలామందికి తెలుసు. అయితే ఆమె తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు మాత్రం ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు. ఇక డైరెక్టర్ అనిల్ సొంతూరు కూడా ఇదే నట. శ్రీలల పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాల్లోనే అయినా.. సెలవుల్లో ఏటా పొంగులూరు వచ్చేదట. చాలా రోజుల పాటు తన అమ్మమ్మ దగ్గరే ఉండేదట. శ్రీలీల తల్లి అనిల్ రావిపూడికి స్వయనా కజిన్ సిస్టర్ అవుతారట. అంటే శ్రీలీల అనిల్‌కు కోడలు వరుస అన్నమాట.
అయితే భగవంత్ కేసరి షూటింగ్ సెట్‌లో ఈ విషయాన్ని దాచిపెట్టారట శ్రీలీల, అనిల్ రావిపూడి. అయితే సెట్స్‌లో అందరి ముందూ అనిల్‌ను డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం ‘మామయ్య’ అంటూ ఆట పట్టించేదట. మొత్తానికి ఈ విషయం తెలిసి చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న శ్రీలీల, అలాగే టాప్ డైరెక్టర్ దగ్గరి బంధువులు కావడం, కలిసి సినిమా తీయడం నిజంగా విశేషమే అంటున్నారు ఫ్యాన్స్. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. అలాగే ప్రియాంక జువాల్కర్, జాన్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ఫై సాహు గార్లపాటి, హరిష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. థమన్ స్వరాలు సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..