Niharika: సినిమాల్లోకి రాక ముందు నిహారిక ఏ ఉద్యోగం చేసిందో తెలుసా? మొదటి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

|

Aug 18, 2024 | 6:20 AM

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజైనప్పటికీ కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తోంది. ఆగస్టు 9 న థియేటర్లలోకి వచ్చిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసింది

Niharika: సినిమాల్లోకి రాక ముందు నిహారిక ఏ ఉద్యోగం చేసిందో తెలుసా? మొదటి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Niharika Konidela
Follow us on

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజైనప్పటికీ కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తోంది. ఆగస్టు 9 న థియేటర్లలోకి వచ్చిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. లాభాల బాటలో పయనించింది. మెగాస్టార్ చిరంజీవి మొదలు మహేశ్ బాబు దాకా నిహారిక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమాలో ఏకంగా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. అలాగే సీనియర్ నటీనటులు కూడా మెరిశారు. కాగా సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతగా తీవ్రంగా కృషి చేస్తోంది నిహారిక. ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రేక్షకులు, అభిమానులను కలుస్తున్నారు. అలాగే కమిటీ కుర్రోళ్లు సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది మెగా డాటర్.

కేఫ్ లో పనిచేశా..

సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి, టీవీ షోలోకి రాకముందు ఒక కేఫ్ లో పనిచేశానని చెప్పుకొచ్చింది. ‘నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోనే ఓ కేఫ్ లో పనిచేసాను. అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే మా నాన్న నన్ను ఎక్కడికి పంపించేవాళ్లు కాదు. అందుకే ఫారెన్ లో చదవాలని ఉన్నా.. వెళ్లలేదు. నా చదువు అంతా ఇక్కడే హైదరాబాద్ లో కంప్లీట్ చేశాను’ అని చెప్పుకొచ్చింది నిహారిక.

ఇవి కూడా చదవండి

కడప దర్గాలో నిహారిక ప్రార్థనలు

 

కాగా నిహారిక ఢీ షోలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటించింది. ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.