S. S. Rajamouli: రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు

రాజమౌళిపై హాలీవుడ్ దర్శకులకు కూడా ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు నెలకొల్పాడు మన జక్కన్న. 'బాహుబలి1,2', 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో రాజమౌళి పాపులారిటీ విపరీతంగా  పెరిగింది. అయితే రాజమౌళికి ఎన్ని కోట్ల  ఆస్తులు ఉన్నాయో తెలుసా..

S. S. Rajamouli: రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
Rajamouli
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:01 PM

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. బాహుబలి సినిమా ఒక్కసారిగా రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా రీ సౌండ్ వచ్చేలా చేశారు.. రాజమౌళిపై హాలీవుడ్ దర్శకులకు కూడా ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు నెలకొల్పాడు మన జక్కన్న. ‘బాహుబలి1,2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి పాపులారిటీ విపరీతంగా  పెరిగింది. అయితే రాజమౌళికి ఎన్ని కోట్ల  ఆస్తులు ఉన్నాయో తెలుసా..

రాజమౌళి ఆస్తి 158 కోట్ల రూపాయలకు పైగానే ఉందని అంటున్నారు. ఒకొక్క సినిమా కోసం రాజమౌళి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దర్శకుడిగానే కాదు..సినిమాల నిర్మాణం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు రాజమౌళి. ఈ మధ్య కాలంలో యాడ్స్ లోనూ నటించారు రాజమౌళి. దీంతో జక్కన్న పారితోషికం భారీగా పెరిగింది.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాజమౌళికి విలాసవంతమైన బంగ్లా ఉంది. రాజమౌళి దీనిని 2008లో కొనుగోలు చేశారు. హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ భూముల్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఆయన దగ్గర  రేంజ్ రోవర్, BMW కారు ఉన్నాయి. వీటి ధర కోటి, కోటిన్నర రూపాయల వరకు ఉంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిట్‌ అయ్యాక రాజమౌళి డిమాండ్ మరింత పెరిగింది.

‘బాహుబలి’ సిరీస్‌కి రాజమౌళి 25 కోట్ల రూపాయలు అందుకున్నాడు. దీని తర్వాత ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని అంటున్నారు.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘మగధీర’, ‘ఈగ’ సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’లో ఆయన అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతోందని అంటున్నారు. త్వరలోనే మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు కానుంది.

View this post on Instagram

A post shared by SS Rajamouli (@ssrajamouli)

రాజమౌళి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by SS Rajamouli (@ssrajamouli)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.