Nayanthara : తగ్గేదే లే.. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సినీప్రియులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో మన శంకరవరప్రసాద్ గారు, తమిళంలో మూకుతి అమ్మాన్ 2 చిత్రాల్లో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతుంది.

Nayanthara : తగ్గేదే లే.. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?
Chiranjeevi, Nayanthara

Updated on: Oct 05, 2025 | 10:28 AM

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ హీరోయిన్ నయనతార. లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరనస మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో అమ్మాన్ 2 చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరు కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా నుంచి నయన్ లుక్ వదిలారు మేకర్స్.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో కనిపించనుందంటూ తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నయనతార మరోసారి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే కేరళలో ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసిన మేకర్స్.. ప్రస్తుతం హైదరాబాద్ లో సాంగ్స్ షూట్స్ చేస్తున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

మరోవైపు తమిళంలో అమ్మాన్ 2 చిత్రంలో నటిస్తుంది నయన్. ఇందులో అమ్మవారి పాత్రలో కనిపించనుంది. దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి శనివారం ఫస్ట్ లుక్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తరపున డాక్టర్ ఐషరీ కె. గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు మీనా, రెజీనా, యోగి బాబు తదితరులు కూడా పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు నయన్ రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..