Tollywood: ఈ టాలీవుడ్ హీరో మనసు బంగారం.. పేద ప్రజల కోసం ఏడాదికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న చేస్తున్న స్టార్..

|

Jul 24, 2024 | 12:04 PM

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు చికిత్సకు సహాయం అందిస్తున్నారు. అలాగే కరోనా మహామ్మారి నుంచి సోనూ సూన్ ప్రజలకు అండగా నిలబడ్డారు. అలాగే విజయ్ దళపతి, సూర్య, గోపిచంద్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ ఓ హీరో మాత్రం చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఏడాదికి

Tollywood: ఈ టాలీవుడ్ హీరో మనసు బంగారం.. పేద ప్రజల కోసం ఏడాదికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న చేస్తున్న స్టార్..
Actor
Follow us on

సాధారణంగా సినీ పరిశ్రమలోని స్టార్ నటీనటులు సామాజిక సేవ చేయడంలో ముందుటారన్న సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోలు ఎంతో మంది పేదలకు సాయం చేస్తున్నారు. కొందరు సొంతంగా ఫౌండేషన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆర్థికంగా సహయం చేస్తున్నారు. అలాగే కష్టాల్లో ఉన్న అభిమానుల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. సామాజిక సంక్షేమం కోసం అగ్రకథానాయకులు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు చికిత్సకు సహాయం అందిస్తున్నారు. అలాగే కరోనా మహామ్మారి నుంచి సోనూ సూన్ ప్రజలకు అండగా నిలబడ్డారు. అలాగే విజయ్ దళపతి, సూర్య, గోపిచంద్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ ఓ హీరో మాత్రం చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఏడాదికి రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. అతడు మరెవరో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ అందుకున్న మహేష్.. అలాగే ఎంతో మంది పేదలకు జీవితాన్ని అందించారు. ఇప్పటివరకు 48 సినిమాల్లో నటించిన మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇలాగే ఈ సూపర్ స్టార్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తున్నాయి.

మహేష్ బాబు నికర విలువ రూ.135 కోట్లు. హైదరాబాద్ లో రూ.30 కోట్లు విలువైన బంగ్లా ఉంది. అలాగే 7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉంది. 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో ఈ వ్యాన్ ను కొనుగోలు చేశాడు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ద్వారా పేద పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు. ఇప్పటివరకు వెయ్యికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. అలాగే ఏపీలో రెండు గ్రామాలను దత్త తీసుకుని రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాలతో సహా అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు. చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్, కష్టాల్లో ఉన్న అభిమానుల కుటుంబాలకు ఆర్థికంగా సాయం.. దత్తత తీసుకున్న గ్రామాలకు సదుపాయాలు కల్పించడం..ఇలా అనేక సామాజిక సేవలతో ఏటా రూ.20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట మహేష్ బాబు. ఇప్పుడు ఈ విషయం తెలిసి మహేష్ మంచి మనసు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.