
జయలక్ష్మి.. ఈ పేరుతో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందరూ తమ నటనతో బాగా ఫేమస్ అయ్యారు. ఇక పై ఫొటోలో ఉన్న నటి పేరు కూడా జయలక్ష్మినే. అప్పట్లో ‘హిమబిందు’ అనే సీరియల్‌లో దివంగత నటుడు అచ్యుత్ చెల్లెలి పాత్రలో కనిపించారు జయలక్ష్మి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని బ్రేక్ తీసుకున్నారు. అయితే పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. మొదట బుల్లితెరపై యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చారు. వెదర్ రిపోర్టర్‌గా, మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో కనిపించారు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లోనూ నటించారు. ఇక కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘పిలిస్తే పలుకుతా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారీ అందాల తార. బొమ్మరిల్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సహాయక నటిగా మెప్పించారు. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు జయలక్ష్మి. అన్నట్లు ఈ సీనియర్ నటి కూతురు కూడా సినిమాల్లో నటించింది. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు యామిని శ్వేత. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ జయం ఛైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఠక్కున గుర్తు పడతారు.
జయం’ సినిమాలో నటించడాని కంటే ముందు చాలా సీరియల్స్‌లో నటించింది యామిని. ఈ క్రేజ్ తోనే జయం సినిమాకు ఎంపికైంది. తన నటనకు ఏకంగా నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే జయం సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదీ అందాల తార. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు తదితర సినిమాల్లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి సారించింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేసింది. పెళ్లి కూడా చేసుకుని విదేశాల్లోనే సెటిలైపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ దంపతులకు ఒక కూతురు పుట్టింది. ఇటీవలే మరోసారి గర్భం ధరించినట్లు సోషల్ మీడియా ద్వారా శుభవార్త చెప్పింది.
కాగా ఈ తల్లీకూతుళ్లు ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. తరచూ తమ ఫ్యామిలీ ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటారు. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. మరి మీరు కూడా ఈ తల్లీ కూతుళ్ల ఫొటోలపై ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి