సాధారణంగా సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ విషయంలో వ్యత్యాసం ఉంటుందని ముందు నుంచి వినిపిస్తున్న మాట. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు చాలా తక్కువగా పారితోషికం ఇస్తుంటారు. ఈ విషయాన్ని చాలా మంది నటీమణులు బయటపెట్టారు. ఒక్క స్టార్ హీరోకు ఇచ్చే రెమ్యునేషన్ తో ఏకంగా పది సినిమాలు నిర్మించవచ్చని గతంలో కామెంట్స్ చేశారు కొందరు తారలు. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పరిస్థితి మారుతుంది. హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ పారితోషికం విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరోయిన్. అయినా.. ఆ బ్యూటీతో సినిమా చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా.. ?.. మీరు అనుకుంటున్నట్లు అలియా భట్, దీపికా పదుకొనే, నయనతార, సాయి పల్లవి కాదు.. వీరందరిని దాటేసిన మరో ముద్దుగుమ్మ. తనే ప్రియాంక చోప్రా. దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోయిన్.
ఫోర్బ్స్, ఇతర ఆన్ లైన్ నివేదికల ప్రకారం ఒక్క సినిమా లేదా ఒక వెబ్ సిరీస్ కోసం రూ. 14 నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేస్తుందట. DNA నివేదిక ప్రకారం రస్సో బ్రదర్స్ నిర్మించిన సిటాడెల్ సిరీస్ లో రిచర్డ్ మాడెన్ తో కలిసి కనిపించింది ప్రియాంక. ఈ సిరీస్ కోసం దాదాపు రూ. 40 కోట్లు పారితోషికం తీసుకుందట. భారతదేశంలోని ప్రాజెక్ట్‌ల కోసం ఆమె 14 నుండి 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని నివేదిక పేర్కొంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. దాదాపు 22 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నానని..కానీ తన కెరీర్ లో మొదటిసారి ఒక హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ సిరీస్ సిటాడెల్ అని వెల్లడించింది. 22 ఏళ్లలో అదే తొలిసారి అని తెలిపింది. ప్రియాంక చోప్రాతో పాటు, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఇతర నటీమణులలో దీపికా పదుకొనే , అలియా భట్ నయనతార ఉన్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం ఫైటర్ సినిమా కోసం దీపికా రూ. 15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు తీసుకుంది. అలాగే రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ కోసం అలియా రూ.10 కోట్లు తీసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.