విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునే కథతో తెరకెక్కిందని తెలుస్తుంది. ఈ మూవీలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని హంగులతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు వెంకటేష్. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు. ఇక వెంకటేష్ చేసిన సినిమాల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమా దృష్టం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 2014 లో విడుదలైన ఈ మూవీ మలయాళం, తెలుగు రెండు భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు. అలాగే ఆతర్వాత సీక్వెల్ గా వచ్చిన దృష్ట్యం 2 కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన చిన్నది గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోయిన్స్ ను బీట్ చేసే అందం.. కుర్రాళ్లను గిలిగింతలు పెట్టె వయ్యారంతో ఆకట్టుకుంటుంది. ఆమె పేరు ఎస్తర్ అనిల్. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ కుర్ర భామ అందాలు ఆరబోస్తూ షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తనగ్లామర్ ఫొటోలతో ఎప్పటికప్పుడు అభిమానులను తన వశం చేసుకుంటుంది. ఈ బ్యూటీ ఫొటోలకు అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి