సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ హీరో, హీరోయిన్స్ అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాగే ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో చిన్నది కూడా చేరడానికి రెడీ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అల్లరి చిన్నారిగా.. అమాయకపు మాటలు.. అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్గా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకూ అజిత్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరా అని ఆలోచిస్తున్నారా.?
ఆ చిన్నది కోలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. ఆమె పేరు యువినా పార్థవి. అప్పుడంటే చిన్నారి కానీ ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ఆ చిన్నది. 2013లో విడుదలైన ‘ఇవాన్ ఏ కమల్’ చిత్రంతో తమిళ చిత్రసీమలోచైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత మంజాభైమా ప్యాలెస్, కత్తి వంటి చిత్రాల్లో నటించింది. సూర్య హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో ఆయన కూతురిగా కనిపించింది. అదేవిధంగా అజిత్ నటించిన వీరమ్ సినిమాలోనూ యువినా నటించింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజిత్, యువినా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు యువినా టీనేజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇంతందంగా మారిపోయిందేంటీ..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే ఈ బ్యూటీ.. సైరన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి