బుర్రపాడు భయ్యా.! విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపాతిపతి భార్య ఈమేనా..!! బయట మాములుగా లేదుగా..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు.

బుర్రపాడు భయ్యా.! విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపాతిపతి భార్య ఈమేనా..!! బయట మాములుగా లేదుగా..
Vijay Sethupathi

Updated on: May 29, 2025 | 7:50 PM

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు పాన్ ఇండియన్ ఫిదా అయ్యింది. విజయ్ సేతుపతి నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది ఆయన నటిస్తుంటే.. లేటుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఏస్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ గాను నటిస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ నటిస్తున్నారు విజయ్ సేతుపతి. కాగా విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సినిమాల్లో విక్రమ్ సినిమా ఒకటి.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ తోపాటు విజయ్ సేతుపతి కూడా నటించారు. అలాగే సినిమా చివరిలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించారు. కాగా విజయ్ సేతుపతికి ఈ సినిమాలో ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే పై ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.? విజయ్ సేతుపతి పక్కన కూర్చోడానికి గొడవ చేస్తే.. గుండె ఎడమవైపు ఉంటుంది అందుకే నిన్ను ఎడమవైపు కూర్చోబెట్టుకున్నా అని డైలాగ్ కొడతాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా.? ఆమె కోసం చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. ఆమె పేరు మహేశ్వరి చాణక్యన్. తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. వీజే గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు తమిళ్ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. కాగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది ఈ వయ్యారి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.