అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..! పూరిజగన్నాథ్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కానీ కొంతమంది.. మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో పూరిజగన్నాథ్ కూతురు ఒకరు. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మెప్పించింది.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..! పూరిజగన్నాథ్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
Puri Jagannadh

Updated on: Oct 09, 2025 | 7:56 PM

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.  పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు పూరి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ ..! పెట్టింది రూ.5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు

ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టబు కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పూరిజగన్నాథ్ కూతురు కూడా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. బుజ్జిగాడు సినిమాలో పూరిజగన్నాథ్ కొడుకు, కూతురు ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించారు. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కూతురు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె పేరు పవిత్ర.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్

బుజ్జిగాడు సినిమా తర్వాత పవిత్ర సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఆకాష్ పూరి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. పవిత్ర మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలకు దూరంగా ఉంటూ.. చదువుల పై దృష్టి పెట్టిన పవిత్ర సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అప్పుడప్పుడే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పవిత్ర కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : చేతిలో రూ. 5వేలు.. కడుపు నింపుకోవడానికి ఒక్క బ్రేడ్ మాత్రమే.. కట్ చేస్తే ఒక్క సాంగ్‌కు రూ. రెండు కోట్లకు పైగా అందుకుంటుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.