సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కొంతం మంది తెలుగు, హిందీ భాషల్లో రాణిస్తున్నారు. ఇక టాలీవుడ్ కు పరిచయం అయిన భామల్లో అయేషా టాకియా ఒకరు. అక్కినేని నాగార్జున, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ.

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!
Super Movie

Updated on: Dec 17, 2025 | 1:55 PM

సినిమా ఇండస్ట్రీ అనేది చాలా గమ్మతుగా ఉంటుంది. ముఖ్యంగా నటీనటుల విషయంలో చాలా రకాల చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. కొంతంది హీరోయిన్స్ ఊహించని విధంగా సినిమాలకు దూరం అవుతున్నారు. మరికొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఓ అమ్మడు మాత్రం తక్కువ సినిమాలతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నిజానికి మొదటి సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఆహా ఇండస్ట్రీకి మరో క్రేజీ బ్యూటీ దొరికింది అనుకునేలోగా ఆమె సినిమాల నుంచి తప్పుకుంది. పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమెను ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టడం ఖాయం. ఇంతకూ ఆమె ఎవరంటే..

విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

తక్కువ సినిమాలే అయినా గ్లామర్ వరల్డ్‌లో గట్టిగా గుర్తుండిపోయిన పేరు అయేషా టకియా. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసిన ఈ బ్యూటీ కింగ్ నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా పరిచయం అయ్యింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ అయేషా టకియా మాత్రం ప్రేక్షకుల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. సూపర్ సినిమాతర్వాత మరో సినిమాలో నటించలేదు ఈ భామ..

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

దాదాపు పదమూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందా అని నెటిజన్స్ గూగుల్ , సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఇక ఈ అమ్మడు సమాజ్వాద్ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీను పెళ్లి చేసుకుంది. ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి అయేషా టాకియా మతాన్ని మార్చుకుంది. సోషల్ మీడియాలోనూ అయేషా టాకియా పెద్దగా కనిపించడం లేదు. ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటున్నారు నెటిజన్స్.

ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.