Nuvvu Nenu: నువ్వునేను సినిమాలోని హీరోయిన్ ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది..

10 ఆగస్ట్ 2001న విడుదలైన ఈ సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిత అప్పటి కుర్రాళ్ళను ఫిదా చేసింది.

Nuvvu Nenu: నువ్వునేను సినిమాలోని హీరోయిన్ ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది..
Nuvvu Nenu
Follow us

|

Updated on: Feb 09, 2023 | 1:11 PM

టాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వాటిలో నువ్వు నేను సినిమా ఒకటి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. అలాగే అనిత హీరోయిన్ గా నటించింది. సునీల్, బెనర్జీ , తనికెళ్ల భరణి , ధర్మవరపు సుబ్రమణ్యం అలాగే తెలంగాణ శకుంతల సహాయక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. 10 ఆగస్ట్ 2001న విడుదలైన ఈ సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిత అప్పటి కుర్రాళ్ళను ఫిదా చేసింది. అందం అభినయంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ.

అనిత అసలు పేరు నటాషా హస్సానందని. ఈ భామ తెలుగుతో పాటు, తమిళ్ కన్నడ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ప్రస్తుతం హిందీలో సీరియల్స్ చేస్తోంది. అలాగే అనిత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ వీర కన్నడిగలో కూడా నటించింది.

హస్సానందని 14 అక్టోబర్ 2013న గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అనిత సినిమాలు తగ్గించి బాలీవుడ్ లో టీవీ సీరియల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నాగిన్ 6లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే అనిత లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ అనిత అంతే అందంగా కనిపిస్తున్నారు. పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నేటితరం హీరోయిన్స్ కు పోటీ ఇస్తున్నారు అనిత.