Tollywood: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. ఎంతకు అమ్ముడైందో తెల్సా

|

Oct 05, 2024 | 1:15 PM

సిల్క్ స్మిత.. అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉందంటే.. ఆ చిత్రం సూపర్ హిట్ అయినట్టే. దాదాపుగా 300కిపైగా చిత్రాల్లో నటించి.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈమె.

Tollywood: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. ఎంతకు అమ్ముడైందో తెల్సా
Silk Smitha
Follow us on

సిల్క్ స్మిత.. అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉందంటే.. ఆ చిత్రం సూపర్ హిట్ అయినట్టే. దాదాపుగా 300కిపైగా చిత్రాల్లో నటించి.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈమె. ఎంతో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ నటి.. చనిపోయే చివరి రోజుల్లో చాలా నరకం అనుభవించిందని అంటుంటారు.

1960, డిసెంబర్ 2న దెందులూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మీ. ఈమెకు 15 ఏళ్లకే పెళ్లి జరిగింది. ఇక అత్తింటివారి వేధింపులు భరించలేక.. ఆమె మద్రాసు వెళ్ళిపోయింది. మొదట టచప్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసి.. ‘ఇనయే తేడి’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘వండిచక్రం’ అనే తమిళ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. విజయలక్ష్మీ కాస్తా.. సిల్క్ స్మితగా మారింది.  జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి స్టార్స్ ఉన్న సమయంలో కుర్రాళ్లకు క్రేజీ హీరోయిన్‌గా అవతరించింది సిల్క్ స్మిత.

చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కి.. స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత.. అప్పట్లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునేదట. అంతెందుకు ఆనాడు ఈమె సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే ఏకంగా లక్ష రూపాయలకు వేలంలో కొన్నారట. దీన్ని బట్టే చెప్పొచ్చు.. అప్పట్లో ఈమెపై కుర్రాళ్లలో క్రష్ ఏమాత్రం ఉండేది. అంతటి గొప్ప నటి.. ప్రేమించిన వ్యక్తి, బంధువుల చేతుల్లో మోసపోయి.. చనిపోయే రోజుల్లో దారుణమైన దయనీయ స్థితిని ఎదుర్కుని మరణించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి