Tollywood : గోపిచంద్, నయనతార జంటగా సినిమా.. నాలుగేళ్లు విడుదల కాకుండా ఆగిపోయింది.. ఎందుకో తెలుసా.. ?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'యాక్షన్ స్టార్'గా గుర్తింపు పొందిన హీరో గోపీచంద్. ఆయన తన కెరీర్‌ను హీరోగా ప్రారంభించి, మధ్యలో విలన్‌గా మెప్పించి, ఆపై మళ్ళీ విజయవంతమైన మాస్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు. అయితే గోపిచంద్ కెరీర్ లో దాదాపు నాలుగేళ్లపాటు విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..

గోపిచంద్ సినిమాలకు తెలుగులో ఉండే ప్రత్యేక వైబ్ గురించి చెప్పక్కర్లేదు. తొలి వలపు సినిమాతో హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. జయం, నిజం వంటి చిత్రాల్లో విలన్ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కానీ ఆయన కెరీర్ లో విడుదల కాకుండా దాదాపు నాలుగేళ్లు ఆగిపోయిన సినిమా గురించి మీకు తెలుసా.. ? అవును.. గోపీచంద్, ప్రకాష్ రాజ్ మధ్య తండ్రి-కొడుకుల సెంటిమెంట్, గోపీచంద్-నయనతార ప్రేమ సన్నివేశాలు, మణిశర్మ సంగీతం అందించిన ఆ మూవీ రిలీజ్ అయ్యేందుకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..
దర్శకుడు బి. గోపాల్ తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఆయన దర్శకత్వంలో గోపిచంద్, నయనతార జంటగా నటించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదల కాకుండా దాదాపు నాలుగేళ్లు ఆగిపోయింది. అందుకు కారణం ఏంటో తెలుసుకుందామా. గోపీచంద్, ప్రకాష్ రాజ్ తండ్రి-కొడుకులుగా నటించారు. ఒక ఆకతాయిగా తిరిగే గోపీచంద్, తండ్రి ప్రకాష్ రాజ్‌ను ఇబ్బంది పెట్టి, చివరికి తన తండ్రికి కష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకుంటాడనేది సినిమా. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. గతంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు మణిశర్మ ఆరడుగుల బుల్లెట్ సినిమాకు సంగీతం అందించారు.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
అయితే ఈ సినిమా విడుదల దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా ఆలస్యం అయ్యింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ విడుదల కాలేదు. 2017 జూన్ 9న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, చెన్నై సిటీ సివిల్ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించడంతో అప్పట్లో విడుదల ఆగిపోయింది. అందుకు కారణం ఆర్థిక కారణాలే. 2021 జూన్ లో విడుదల చేయాలని అనుకున్నా, కరోనా సెకండ్ వేవ్ , లాక్ డౌన్ వల్ల అది మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సినిమా 8 అక్టోబర్ 2021న థియేటర్లలో విడుదలైంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
