
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఫేమ్ ఉన్న హీరోలంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు తరుణ్, ఉదయ్ కిరణ్. వీరిద్దరి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ వచ్చాయి. ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని అప్పట్లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోస్. కానీ వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సింది. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాక చివరి క్షణంలో ఉదయ్ స్థానంలోకి బాలీవుడ్ నటుడు వచ్చాడు. ఇంతకీ తరుణ్, ఉదయ్ కిరణ్ కాంబో ప్రాజెక్ట్ మిస్ అయిన సినిమా ‘సోగ్గాడు’. డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005 మార్చి 31న విడుదలైంది. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తరుణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాను ముందుగా తరుణ్, ఆర్తి ఆగర్వాల్, ఉదయ్ కిరణ్ కాంబోలో తెరకెక్కించాలని అనుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ రవిబాబు. అప్పుడు తన జీవితంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ మూవీ ప్లాప్ అయ్యిందని అన్నాడు.
సోగ్గాడు సినిమాను తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి ఆగర్వాల్ ముగ్గురితో కలిసి తీద్దామనుకున్నారు. కానీ కుదరలేదని.. కథ విన్న తర్వాత తరుణ్, ఆర్తి ఆగర్వాల్ ఇద్దరూ ఒకే చెప్పారని.. కానీ ఉదయ్ మాత్రం డైలమాలో ఉండిపోయాడని అన్నారు డైరెక్టర్ రవిబాబు. ఆయన స్వయంగా చెన్నై వెళ్లి అడిగితే సినిమా చేస్తానని అన్నారట ఉదయ్. కానీ తర్వాత నిర్మాత సురేష్ బాబు కలిసిన తర్వాత సినిమా చేయడం లేదని చెప్పాడట. దీంతో అక్కడే ఉన్న రవిబాబు కోపంతో హిందీ నుంచి జుగల్ హన్సరాజ్ ను తీసుకొచ్చి ఉదయ్ చేయాల్సిన చందు పాత్రను అతడితో చేయించారట. తన కెరీర్ లో ఈగోకు పోయి.. కోపంతో తీసుకున్న ఆ నిర్ణయం.. మళ్లీ అలా ఎప్పుడూ చేయలేదని.. కష్టమైననా.. నష్టమైనా ఉదయ్ తో చేయాల్సిందని అన్నారు రవిబాబు.
అప్పట్లో తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ ఈ ముగ్గురికి ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. దీంతో ఈ ముగ్గురి పాత్రల మధ్య ట్రయాంగిల్ ప్రేమకథతో ఎమోషనల్ గా వచ్చే ఈ లవ్ స్టోరీని ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేందని.. అందుకు తగినట్లుగానే క్లైమాక్స్ రాసుకున్నారని.. కానీ హన్సరాజ్ ను తీసుకురావడం వల్ల ఆర్తి ఆగర్వాల్ పాత్ర తరుణ్ తోనే వెళ్లిపోతుందని ప్రేక్షకులకు ముందే అర్థమయ్యిందని .. దీంతో సినిమా హిట్ కాలేదని అన్నారు రవిబాబు. నిజానికి ఈ మూవీ క్లైమాక్స్ వేరేలా ప్లాన్ చేశారు . రైల్వే స్టేషన్లో ఒక రైటు ఇటువైపు.. మరో రైలు అటు వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక రైల్లో ఉదయ్ కిరణ్.. మరో దానిలో తరుణ్ ఉంటారు. ఆర్తి తరుణ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నీ ఫస్ట్ లవ్ అతడు తన దగ్గరకు వెళ్లు అని తరుణ్ చెప్పడంతో తిరిగి ఉదయ్ దగ్గరకు వెళ్తుంది. నీ ఫస్ట్ లవ్ నేనే కావొచ్చు.. కానీ సాయం, సాహసం చేసింది అతడు.. తనే నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పడంతో ఆర్తి రైలు దిగుతుంది. కాసేపటి రెండు రైళ్లు వెళ్లిపోతాయి. ఆ తర్వాత ట్రాక్ మధ్యలో కూర్చొని ఆర్తి ఏడుస్తున్న సమయంలో ఆమెకు ఎదురుగా ఒక గులాబీ కనిపిస్తుంది. అది తరుణ్ తెచ్చి ఇచ్చింది. ఇలా క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నానని అన్నారు రవిబాబు.