Prabhas: ప్రభాస్ రాముడిగానే కాదు కృష్ణుడిగాను కనిపించిన సినిమాఎదో తెలుసా..
ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించి మెప్పించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ను రాముడిగా చూపించాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిన్న మొన్నటి వరకు యాక్షన్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఇప్పుడు ప్రభాస్ అంటే గుర్తుపట్టని సినీ లవర్ ఉండడు. ఇక ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించి మెప్పించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ను రాముడిగా చూపించాడు. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ సినిమాలో రామాయణాన్ని తప్పుగా చూపించారని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ రాముడిగానే కాదు కృష్ణుడి గెటప్ కూడా నటించిన విషయం మీకు తెలుసా..
అవును ప్రభాస్ రాముడిగానే కాదు కృష్ణుడి గెటప్ కూడా వేశారు. ప్రభాస్ కృష్ణుడి గెటప్ వేసిన సినిమా మరేదో కాదు బిల్లా. మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కింది బిల్లా . ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమాలో డాన్ గా ఓ జేబుదొంగ గా నటించాడు మన డార్లింగ్.
ఈ సినిమాలో ఓ పాటలో ప్రభాస్ కృష్ణుడి గెటప్ లో కనిపించాడు. కిరీటం, నగలు, ఫూట్ పట్టుకొని కృష్ణుడి స్టైల్ లో ఓ స్టిల్ కూడా ఇచ్చారు. అలాగే మిర్చి సినిమాలోనూ ఓ సాంగ్ లో కృష్ణుడిగా కనిపించారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సలార్ , ప్రాజెక్ట్ కే , స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నారు. సలార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రాజెక్ట్ కే నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు. 




