Tripti Dimri: ‘యానిమల్’ బ్యూటీకి అమాంతం పెరిగిన ఫాలోవర్స్.. అప్పుడు.. ఇప్పుడు ఎంత ఉన్నారో తెలుసా..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. ఇందులో వీరిద్దరి అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ త్రిప్తి డిమ్రి. ఇందులో ఆమె మరో కథానాయికగా నటించింది. హీరో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా ‘యానిమల్’. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. ఇందులో వీరిద్దరి అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ త్రిప్తి డిమ్రి. ఇందులో ఆమె మరో కథానాయికగా నటించింది. హీరో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి. దీంతో ఓవర్ నైట్ స్టా్ర్ అయ్యింది త్రిప్తి. ఇప్పుడు ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమా ఎఫెక్ట్ తో త్రిప్తికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే త్రిప్తికి ఫాలోవర్స్ సైతం పెరిగిపోయింది.
యానిమల్ సినిమాకు ముందు త్రిప్తి పేరు అసలు చాలా మందికి తెలియదు. నవంబర్ లో చివరి వారం త్రిప్తికి ఇన్ స్టాలో 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. 2015లో త్రిప్తి ఇన్ స్టాలో ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి నెట్టింట యాక్టివ్ గా ఉంటూ తన సినిమా విశేషాలతోపాటు.. రీల్స్ తోనూ ఆమె సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్టులన్నింటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
View this post on Instagram
త్రిప్తి డిమ్రీ.. 1994 ఫిబ్రవరి 23న ఉత్తరాఖండ్ లో జన్మించింది. 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మజ్ను, ఫిల్మ్ బుల్బుల్, ఖలా చిత్రాల్లో నటించింది. కానీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కట్టాయి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
