AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK-Trisha: విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

గత మూడు రోజులుగా టీవీకే అధినేత విజయ్, బ్యూటీ క్వీన్ త్రిషల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీతో త్రిషకు ఎలాంటి సంబంధం లేకపోయినా విజయ్ కు, ఆమెకు ముడిపెడుతూ పలు ఆసక్తికర కథనాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Vijay TVK-Trisha: విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
TVK Vijay, Trisha
Basha Shek
|

Updated on: May 07, 2026 | 3:12 PM

Share

తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ భారీ విజయం సాధించింది. ఏకంగా 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవరసరముంది. మ్యాజిక్ ఫిగర్ (118) వస్తే త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా టవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా త్రిషతో విజయ్ రిలేషన్ షిప్ గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. విజయ్- త్రిషలు కలిసి ఎన్ని సినిమాలు చేశారు? వారిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? తదితర అంశాలపై నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గిల్లి’ (ఒక్కడు సినిమా రీమేక్)లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, ‘లియో’ వంటి చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే లియో సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్- త్రిష ప్రేమ పుకార్లు మొదలయ్యాయి. ఇక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్ సతీమణి సంగీత భర్తతో విడాకులు కోరడం, ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత త్రిష, విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరవ్వడం వీరి డేటింగ్ రూమర్లకు మరింత బలాన్నిచ్చాయి.

ఇక త్రిష బర్త్‌డే (మే 4) రోజే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్‌ భారీ విజయం సాధించడంతో వీరిద్దరి బంధంపై రూమర్స్‌ మరింత ఎక్కువయ్యాయి. విజయ్‌ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటారనే రూమర్లు తెగ వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఇప్పుడు విజయ్‌-త్రిషల వయసు గురించి నెట్టింట సెర్చ్‌ చేస్తున్నారు. దీని ప్రకారం .. విజయ్‌ 1974 జూన్ 22న జన్మించారు. ప్రస్తుతం ఆయనకు 51 ఏళ్లు. ఇక త్రిష 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ తేడా ఉందన్న మాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us