Ram Charan : బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగమ్మాయి.. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే చరణ్ పక్కన ఛాన్స్.. ?
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఇటీవలే పెద్ది సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న RC17 ప్రాజెక్ట్ ముహూర్తపు పూజా నవంబర్ 1న జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘RC 17’. ఈ సినిమాపై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు నవంబర్ 1న అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ తరుణంలో చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించే కథానాయిక ఎంపికపై ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా పలువురు ప్రముఖ బాలీవుడ్, సౌత్ భామల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి అచ్చ తెలుగు మూలాలున్న యువ నటి సాత్విక వీరవల్లి పేరు రేస్‌లో ముందున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే గ్లోబల్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
సాత్విక వీరవల్లి బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే, ఆమె అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేయడమే కాకుండా, శాస్త్రీయ నృత్యంలోనూ విశేషమైన ప్రావీణ్యం సంపాదించారు. నటనపై ఉన్న మక్కువతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె, ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే సుకుమార్-చరణ్ కాంబో లాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ఆమెకు అవకాశం దక్కడం ఆమె కెరీర్‌కు నిజంగా బిగ్గెస్ట్ బ్రేక్ అని అంటున్నారు. సుకుమార్ మార్క్ సహజమైన కథాకథనాలకు ఈ యంగ్ బ్యూటీ సరిగ్గా సరిపోతారని భావించే మేకర్స్ ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం. నవంబర్ 1న జరగనున్న పూజా వేడుకలతో ఈ క్రేజీ అప్డేట్పై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
నవంబర్ 1, 2026న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరగనున్నాయి. ఆ తర్వాత రోజే అంటే నవంబర్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సుకుమార్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ‘రంగస్థలం’ , ‘పుష్ప’ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఈ హ్యాట్రిక్ కాంబినేషన్లో దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
#RC17 పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి @AlwaysRamCharan పక్కన హీరోయిన్ గా.. కానీ చాన్స్ కొట్టేసింది మాత్రం అచ్చ తెలుగు అమ్మాయి ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి https://t.co/1p8qZjFZeY
— devipriya (@sairaaj44) October 31, 2026
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
