Simran: సిమ్రాన్ చెల్లి కూడా హీరోయిన్ అని మీకు తెలుసా.? కానీ 21 ఏళ్లకే సూసైడ్

|

Jan 08, 2025 | 2:04 PM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. దక్షిణాదిలోని అగ్రకథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిమ్రాన్.. అప్పట్లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రాన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది.

Simran: సిమ్రాన్ చెల్లి కూడా హీరోయిన్ అని మీకు తెలుసా.? కానీ 21 ఏళ్లకే సూసైడ్
Simran
Follow us on

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.  ఎంతోమంది ఫెవరేట్ హీరోయిన్ సిమ్రాన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారును కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది సిమ్రాన్. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్రహీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది సిమ్రాన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది ఈ క్రేజీ బ్యూటీ.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ప్రస్తుతం సిమ్రాన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో సిమ్రాన్ చివరిగా జాన్ అప్పారావ్ 40ప్లస్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్ లో నటించలేదు. కానీ హిందీలో అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. తమిళ్ లో చివరిగా అంధగన్ సినిమాలో నటించారు ఈ స్టార్ హీరోయిన్. అలాగే సోషల్ మీడియాలోనూ సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

ఇదిలా ఉంటే సిమ్రాన్ సిస్టర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చేశారని మీకు తెలుసా.? అవును సిమ్రాన్ కు ఇద్దరు చెల్లెలు. మోనాల్, జ్యోతి ఆనంద్. ఈ ఇద్దరూ హీరోయిన్స్ గా చేశారు. వీరిలో మోనాల్ తెలుగులోనూ సినిమాలు చేసింది. మోనాల్ తమిళ్ లో చాలా సినిమాలు చేసింది. కాగా తెలుగులో ఇష్టం అనే సినిమాలో మాత్రమే నటించింది. తమిళ్ లో దళపతి విజయ్ నటించిన బద్రి రీమేక్ లో నటించింది మోనాల్. మోనాల్ 2002 చిన్నవయసులో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. 14 ఏప్రిల్ 2002న కేవలం 21 ఏళ్ల వయస్సులో చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని కనిపించింది. మే 2002లో, ఆమె ఆత్మహత్యకు కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని ఆమె సోదరి సిమ్రాన్ గతంలో ఆరోపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .