Khadgam movie: అరెరే.. సూపర్ ఛాన్స్ మిస్సైన హీరోయిన్.. ఖడ్గం సినిమాలో సంగీత పాత్రకు ఆమె ఫస్ట్ ఛాయిస్..
తెలుగు సినీరంగంలో అతి తక్కువ సమయంలోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. కానీ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన బ్యూటీ సంగీత. ఖడ్గం సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకుంది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ఖడ్గం ఒకటి. ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ఇదే. ఒకప్పుడు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పటికీ స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుల్లితెరపై కచ్చితంగా ప్రసారమవుతుంది ఈమూవీ. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సోనాలి బింద్రే, కిమ్ శర్మ, పూజా భారతి హీరోయిన్లుగా నటించారు.
ఇక ఈ సినిమాలో కథానాయికగా సంగీత కనిపించింది. హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో తన తల్లితో కలిసి పట్నం వచ్చిన అమాయకమైన అమ్మాయి పాత్రలో కనిపించి.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో సంగీత పాత్రను మిస్సైన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? అవును.. ఈ సినిమాలో రవితేజ ప్రియురాలిగా నటించాల్సిన హీరోయిన్ సంగీత కాదు. ఆమె పాత్రకు ముందుగా అనుకున్న హీరోయిన్ సాక్షి శివానంద్.
ఇక ఇదే విషయం గురించి చిత్రయూనిట్ ఆమెను సంప్రదించగా.. స్టోరీ విన్న తర్వాత చేయనని చెప్పేశారట సాక్షి శివానంద్. దీంతో ఆమె స్థానంలోకి సంగీతను ఎంపిక చేశారు మేకర్స్. ఈ సినిమాతో సంగీతకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది సంగీత. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగీత..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోహీరోయిన్లకు తల్లిగా, వదినగా నటిస్తుంది.

Sakshi Shivanandh




