
సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు యూత్ లో పిచ్చి ఫాలోయింగ్ ఉండేది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. ముఖ్యంగా గ్లామరస్ లుక్స్ లో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అదే సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే ఇలియానా. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇలియానా ఒక తమిళ నిర్మాత దగ్గర 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని, సినిమా చేయకుండా, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా వివాదానికి దారి తీసిందని నిర్మాత కట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యవహారంపై సదరు నిర్మాత సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలియానా తాను డేట్లు ఇచ్చానని, నిర్మాత వాటిని వాడుకోకపోవడంతో అడ్వాన్స్ ముగిసిపోయిందని వాదించింది. అయితే, సినిమా కోసం మేకప్ వేసుకోకుండా, లొకేషన్‌కు రాకుండా ఉంటే అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉందని ఛాంబర్ స్పష్టం చేసిందని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..
ఆనంద్ సినీ సర్వీస్ లాగ్ షీట్లను పరిశీలించగా, ఇలియానా తాను డేట్లు ఇచ్చానని చెప్పిన రోజుల్లో వేరే సినిమాలకు పనిచేసినట్లు రుజువైందని.. దీనితో, 40 లక్షల రూపాయలు తిరిగి చెల్లించకపోతే సౌత్‌లో నటించడానికి వీల్లేదని ఛాంబర్ హెచ్చరించింది. ఆమె చెల్లించకపోవడంతో సౌత్‌లో నిషేధం విధించారని అన్నారు. ఈ నిర్ణయం తర్వాత ఇలియానా ఒకటి రెండు సౌత్ సినిమాలకు కమిట్ అయినప్పుడు, ఆ నిర్మాతలకు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్‌లో ఆమెపై ఫిర్యాదు ఉందని, 40 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. ఆమె లేదా నిర్మాతలు ఆ డబ్బు చెల్లించకపోతే షూటింగ్‌కు రాకూడదని కూడా వారికి సూచించారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..
Ileana New
ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..