
తేజ సజ్జా హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 5 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియ మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది. వీరితో పాటు జగపతి బాబు, జయరాం వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక హనుమాన్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన తేజ సజ్జా మిరాయ్ లోనూ అదరగొట్టాడు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగుల్లో తన మార్క్ చూపించాడు. అయితే మిరాయ్ లో హీరోకు ఎంత పేరొచ్చిందో విలన్ గా మంచు మనోజ్ కు కూడా అంతే పేరొచ్చింది. మహవీర్ లామా, బ్లాక్ స్వార్డ్ అనే రెండు పాత్రలో మనోజ్ నటన నెక్ట్స్ లెవెల్ అని ప్రశంసలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ కు ఇది గ్రేట్ కమ్ బ్యాక్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మనోజ్ కూడా మిరాయ్ సినిమా విజయం తన లైఫ్ లో మర్చిపోలేదని సక్సెస్ మీట్స్ లో ఎమోషనల్ అవుతున్నాడు.
అయితే మిరాయ్ సినిమాలో విలన్ రోల్ కోసం మంచు మనోజ్ కంటే ముందు హీరో సందీప్ కిషన్ ను అనుకున్నారట మేకర్స్. తేజ సజ్జాతో కలిసి సందీప్ కిషన్ కు మిరాయ్ స్టోరీ కూడా వినిపించారట. అతనికి కూడా కథతో పాటు తన రోల్ కూడా బాగా నచ్చిందట. అయితే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ కారణంగా మిరాయ్ సినిమాను చేయలేకపోయాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మంచు మనోజ్ ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు సందీప్ కిషన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న మజాకా మూవీ తనను మరింత డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మిరాయ్ సినిమా చేసుంటే కెరీర్ కి బాగా కలిసి వచ్చేదేమోనని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.