హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. మరికాసేపట్లో ఇద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నారు. దీంతో ఇద్దరి పెళ్లి ఫోటోస్ గురించి నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు శోభితా, చైతన్య పర్సనల్ లైఫ్, నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు. అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు నాగచైతన్య. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం చైతన్య ఆస్తుల విలువ రూ.160 కోట్లు. అలాగే నాగార్జున ఆస్తులు మొత్తం రూ.3000 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
నాగచైతన్య ఒక్క సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. అలాగే ఎన్నో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు. నాగ చైతన్య షోయు అనే క్లౌడ్ కిచెన్ చైన్‌ని స్టార్ట్ చేశాడు. నాగ చైతన్యకు కార్లంటే చాలా ఇష్టం. ఫెరారీ F 430, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, పోర్షే 911 GT3 వంటి కార్లను కలిగి ఉన్నాడు. అలాగే BMW R9T , ట్రయంఫ్ థ్రక్స్టన్ R వంటి సూపర్ బైక్స్ ఉన్నాయి.
ఇక శోభితా ధూళిపాళ ఆస్తులు రూ.10 కోట్లు ఉంటుందని సమాచారం. శోభితా.. తెనాలిలో జన్మించి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రమణ్ రాఘవ్ 2.0 సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు రూ.70 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పారితోషికం తీసుకుంటుంది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.