Cinema : హీరోయిన్లకే చెమటలు పట్టిస్తోన్న సీనియర్ బ్యూటీ.. 50 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా.. ఇప్పుడు చూస్తే..

ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెరపై రియాల్టీ షోలతో అలరిస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Cinema : హీరోయిన్లకే చెమటలు పట్టిస్తోన్న సీనియర్ బ్యూటీ.. 50 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా.. ఇప్పుడు చూస్తే..
Shilpa Shetty

Updated on: Nov 16, 2025 | 2:32 PM

ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ. ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తన లుక్స్, గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శిల్పా శెట్టి. 1993లో ‘బాజీగర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శిల్పా శెట్టి, ప్రభుదేవాతో కలిసి ‘మిస్టర్ రోమియో’, విజయ్‌తో కలిసి ‘కుషి’ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. అలాగే వెంకటేశ్ జోడిగా సాహసవీరుడు సాగరకన్య చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

ఆమె ఒక మోడల్, వ్యాపారవేత్త, నిర్మాత కూడా. శిల్పా శెట్టి నవంబర్ 22, 2009న వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా, శిల్పా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే అందం, ఫిట్‌నెస్ చిట్కాలను పంచుకుంటుంది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది శిల్పా శెట్టి.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

శిల్పా శెట్టి 50 ఏళ్ల వయసులో కూడా తన అందాన్ని కాపాడుకుంటూనే ఉంది. ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. ప్రతి రోజూ యోగా, వర్కవుట్స్ చేయడంతోపాటు ఇంట్లో వండిన పదార్థాలను మాత్రమే తీసుకుంటానని తెలిపింది. అలాగే పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటానని.. చెప్పారు. ప్రస్తుతం శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..