
కెరీర్ ప్రారంభంలో ప్రేమ ఇష్క్ కాదల్, సెకెండ్ హ్యాండ్, అప్పట్లో ఒకడుండే వాడు తదితర సినిమాల్లో నటించాడు శ్రీ విష్ణు. అయితే సోలో హీరోగా మాత్రం అతనికి బ్రేక్ ఇచ్చింది నీది నాది ఒకే కథ సినిమానే. అంతకు ముందు చేసిన మెంటల్ మదిలో సినిమా కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. వీటి తర్వాత బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, అల్లూరి తదితర సినిమాల్లో నటించాడు. సామజ వరగమనతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఓమ్ భీమ్ బుష్ కూడా బాగానే ఆడింది. కమర్షియల్ హిట్ కాకున్నా స్వాగ్ కూడా శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక చివరిగా సింగిల్ అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో నటించాడు శ్రీ విష్ణు. ఈ ఏడాది మేలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలోతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సింగిల్ సినిమాను నిర్మించారు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 23 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
అయితే సింగిల్ సినిమా కథను మొదట 15 మంది హీరోలు తిరస్కరించారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీ విష్ణునే ఓ సందర్భంలో వెల్లడించాడు.’ సింగిల్ సినిమా కథను మూడేళ్ల క్రితమే డైరెక్టర్ కార్తీక్ రాజు నాకు చెప్పారు. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారు వాళ్లందరికీ కూడా థాంక్యూ’ అని ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. అయితే ఈ హీరోల పేర్లు మాత్రం వెల్లడించలేదు. కాగా సింగిల్ సినిమా ఆఫర్ మొదట యూత్ స్టార్ నితిన్ దగ్గరకు వెళ్లిందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికే అతని చేతిలో చాలా సినిమాలు ఉండడంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట.
It’s a Blockbuster Sunday at the Box-office for #Single 💥
Theatres are echoing with fun & laughter 🤩 And Crowds are loving every moment of #SingleMovie 🤗🔥
🎟️ https://t.co/0LPVc1bviF @sreevishnuoffl @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @caarthickraju #VidyaKoppineedi… pic.twitter.com/PpiddHBJjr
— Geetha Arts (@GeethaArts) May 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..