సుధీర్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో బబ్లీ.. ఇప్పుడు చూస్తే మత్తెక్కాల్సిందే

|

Jul 25, 2024 | 11:25 AM

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కి కొదవలేదు. మూడు కన్నా ఎక్కువ సినిమాలతో ఎందరో నటీమణులు ఇండస్ట్రీని ఏలుతూ వచ్చారు. అయితే క్రమేపీ పరిస్థితులు మారాయ్. తెలుగులో ఛాన్స్‌లు దొరక్కపోతే.. వేరే భాషల్లో ప్రయత్నాలు సాగించి.. అక్కడ అవకాశాలను దక్కించుకుంటున్నారు.

సుధీర్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో బబ్లీ.. ఇప్పుడు చూస్తే మత్తెక్కాల్సిందే
Actress
Follow us on

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కి కొదవలేదు. మూడు కన్నా ఎక్కువ సినిమాలతో ఎందరో నటీమణులు ఇండస్ట్రీని ఏలుతూ వచ్చారు. అయితే క్రమేపీ పరిస్థితులు మారాయ్. తెలుగులో ఛాన్స్‌లు దొరక్కపోతే.. వేరే భాషల్లో ప్రయత్నాలు సాగించి.. అక్కడ అవకాశాలను దక్కించుకుంటున్నారు ఈ కాలం హీరోయిన్లు. అలా ఇతర ఇండస్ట్రీలలో ఫేమస్ అయ్యి.. తిరిగి మళ్లీ తమ సొంత ఇండస్ట్రీలో వరుస ఛాన్స్‌లతో దూసుకుపోతున్నారు. సరిగ్గా ఆ కోవకు చెందినదే ఈ హీరోయిన్ కూడా. ఈ భామ పుట్టింది చండీగఢ్‌లో.. బాలీవుడ్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. అయితే అప్పటికీ ఈ భామకు అనుకున్నంత ఫేం రాలేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గతేడాది థ్రిల్లర్ ఓటీటీ సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. తన ఫ్యాన్ బేస్‌ను అమాంతం పెంచేసుకుంది ఈ బ్యూటీ. ఇప్పటికైనా ఎవరో గుర్తుపట్టారా.?

ఇది చదవండి: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

ఎస్.! మీరనుకున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు వామిక గబ్బి. మోడలింగ్ కెరీర్‌ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. తొలుత ‘జబ్ వి మెట్’, ‘లవ్ ఆజ్ కల్’, ‘మసం’, ‘బిట్టూ బాస్’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. తన నటనకు మంచి మార్కులు తెచ్చుకుంది. అటు తెలుగులో సుధీర్ బాబు సరసన ‘భలే మంచి రోజు’, తమిళంలో ‘మాలై నేర్తు మయక్కం’, మలయాళంలో ‘గోదా’ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే అవేమి కూడా వామికకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ’83’, ‘ఫుర్సాట్’, ‘ఖుఫియా’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది ఈ భామ.

కాగా, ప్రస్తుతం వామిక పంజాబీలో ‘కిక్లి’, తమిళంలో ‘జీని’, హిందీలో ‘బేబీ జాన్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన వెకేషన్ ఫోటోలు, లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతోంది.

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి