
చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా క్రేజ్ తెచ్చుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ కోవకు చెందిన ఓ నటి ఈమె. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత క్రేజీ హీరోయిన్‌గా, హాలీవుడ్ స్థాయికి వెళ్లింది ఈ భామ. ఆమె మరెవరో కాదు అవంతిక వందనపు. మన తెలుగు అమ్మాయి.. హాలీవుడ్‌లో క్రేజ్‌తో పాటు తెగ పాపులారిటీ సంపాదించింది. 2016లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి, మనమంతా లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇవన్నింటి కంటే అవంతిక నటించిన ‘ఫార్చ్యూన్ ఆయిల్’ యాడ్ తెగ పాపులర్ అయ్యింది.
హైదరాబాద్ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ.. ‘స్పిన్’ అనే మూవీతో హాలివుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2021లో ‘బూమిక’ అనే తమిళ చిత్రంలో నటించగా.. ఆపై ‘మొక్సి’, ‘సీనియర్ ఇయర్’, ‘మీన్ గర్ల్స్’, ‘తారోట్’ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అమెరికన్ సిరీస్‌లతో నటిస్తూ బిజీగా ఉన్న అవంతిక.. ‘బల్లెరిన ఓవర్‌డ్రైవ్’ అనే సినిమాతో రానుంది. ఈ భామ నటించిన మీన్ గర్స్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కాగా.. ప్రస్తుతం ఈమె వయస్సు 20 ఏళ్లు.. అప్పటి ఫోటోలతో పోల్చుతూ.. ఇప్పుడీమె గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని నెటిజన్లు అంటున్నారు. కాగా, నెట్టింట అవంతిక హాట్ ఫోటోలు వైరల్‌గా మారాయి.