Balayya: బాలయ్య వ్యక్తిత్వంపై టీజే టిల్లు కిర్రాక్ కామెంట్స్.. సొంతం అనుకుంటే ఎంతదూరమైనా వెళ్తారు

బాలయ్య వ్యక్తిత్వంపై సిద్ధు జొన్నలగడ్డ కీలక కామెంట్స్ చేశాడు. ఆయన్ను సూపర్‌మ్యాన్‌తో పోల్చాడు. ఎవర్నైనా నమ్మితే.. వారి కోసం బాలయ్య ఎంత దూరమైనా వెళ్తారని వెల్లడించాడు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Balayya: బాలయ్య వ్యక్తిత్వంపై టీజే టిల్లు కిర్రాక్ కామెంట్స్.. సొంతం అనుకుంటే ఎంతదూరమైనా వెళ్తారు
Nandamuri Balakrishna - Siddhu Jonnalgadda

Updated on: Apr 17, 2023 | 9:06 AM

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రజంట్ మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇతగాడు మంచి రైటర్ కూడా. ఇటీవల ‘డీజే టిల్లు’ మూవీతో తన యాక్టింగ్‌తో పాటు తన పెన్ను పవరేంటో చూపించాడు. గతేదాది విడుదలైన ఈ సినిమా సెన్సేసన్ క్రియేట్ చేసింది. కలెక్షన్లతో హోరెత్తించింది. ప్రజంట్ ‘టిల్లు స్క్వేర్’  తెరకెక్కించే పనిలో ఉన్నాడు సిద్దు. అయితే బాలయ్య ‘ఆహా’ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్‌‌కు మరో హీరో విశ్వక్ సేన్‌తో కలిసి హాజరయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరోలకు బాలయ్యతో మంచి బాండింగ్ ఏర్పడింది. నటసింహం రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు.. ఆయన క్యారెక్టర్ ఏంటి అన్నది వీరికి అర్థమయ్యింది.

కాగా తాజా ఇంటర్వ్యూలో బాలయ్య గురించి చాలా విషయాలు పంచుకున్నాడు సిద్ధు. కేలవం బయట ప్రేక్షకులు మాత్రమే  కాదు.. ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కూడా ఆయనకు అభిమానులే అని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ గారు విశాల హృదయం కలిగినటువంటి ఒక సూపర్ మ్యాన్ అని పేర్కొన్నాడు సిద్ధు. ఆయన ఒక్కసారి ఒక మనిషిని తన సొంత వ్యక్తి అని భావిస్తే.. అతడి కోసం ఎంత దూరమైనా వెళ్తారని చెప్పుకొచ్చాడు. అందమైన, దయ కలిగిన చిన్నపిల్లాడి మనస్తత్వం బాలయ్యది అని పేర్కొన్నాడు సిద్ధూ.

కాగా ప్రజంట్ నటసింహం.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాజల్ హీరోయిన్ కాగా.. శ్రీలీల కీ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ.. టిల్లు స్క్వేర్‌తో పాటు మలయాళంలో టొవినో థామస్ నటించిన ‘తల్లుమాల’ మూవీ రీమేక్‌ చేసేందుకు యత్నిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.