ఆర్ఆర్ఆర్ (RRR).. ఇప్పుడు ఎక్కడ విన్నా.. చూసిన ఇదే.. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా కొనసాగుతుంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చరణ్.. తారక్ అభిమానుల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్ల వద్ద మెగా నందమూరి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. జక్కన్న అండ్ టీంపై సినీ విశ్లేషకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ బద్దలుకొడుతూ ఆర్ఆర్ఆర్ దూసుకుపోతుంది. దేశవ్యా్ప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. జనాలతో… ట్రిపుల్ ఆర్ థియేటర్లు ఓ పక్క కళకళలాడుతుంటే… ఆ ఏరియాలో మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. చెర్రీ- తారక్ యాక్షన్ చూసి అందరూ ఈలలు గోలలు చేస్తుంటే… అక్కడ మాత్రం ఏమీ పట్టనట్టు ఎవరి పని వారు చేసుకుంటూ ఊపోతున్నారు. సినిమాను అట్టర్ ప్లాప్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఎందుకంటారా… కోపంతో… జక్కన్న మీదున్న కోపంతో… కన్నడ భాష మీదున్న అభిమానంతో!
విషయమేంటంటే! తెలంగాణ, కన్నడ బార్డర్‌లో ఉన్న కొన్ని థియేటర్లలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమాను రిలీజ్ చేశారు ట్రిపుల్ ఆర్ కన్నడ ప్రొడ్యూసర్స్ . కానీ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారనే కారణంతో తెలుగు సినిమానే నేరుగా రిలీజ్ చేశారు. కన్నడ లాంగ్వేజ్‌లో ట్రిపుల్ ఆర్ ఉండి కూడా తెలుగులోనే సినిమాను రిలీజ్ చేయడంతో… అక్కడి కన్నడిగులు కాస్త నొచ్చుకున్నారు. సినిమాను బాయ్ కాట్ చేయండి అంటూ పిలుపునిచ్చారు. అయితే అప్పటికే రంగంలోకి దిగి మేకర్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ…. పట్టించుకోని తెలంగాణ, కన్నడ బార్డర్ కన్నడిగులు… ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాను… ఆ సినిమా ఆడుతున్న థియేటర్ను పట్టించుకోవడం మానేశారు. దీంతో హౌస్ ఫుల్ బోర్డు పడాల్సిన థియేటర్… ఖాళీగా కనబడుతోంది.
Also Read: Beast: పాన్ ఇండియా స్టార్‌గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..
Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..
Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..