ఆ నటుడు నాకు అస్సలు నచ్చడు.. అతన్ని తట్టుకోవడం కష్టం : దర్శకుడు వి.ఎన్. ఆదిత్య
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, ఓనటుడి ప్రొఫెషనల్ క్రమశిక్షణారాహిత్యంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో మా ఎన్నికలు, రాజీనామాలు, తిట్ల పురాణం వంటి విషయాలపై కూడా ఆయన మాట్లాడారు. అలాగే ఆయన మరికొన్ని ఆసక్తికర విషయాల పై కూడా స్పందించారు .

ప్రముఖ తెలుగు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సినీ పరిశ్రమలోని పలు కీలక విషయాలపై తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ గురించి వి.ఎన్. ఆదిత్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ తో తాను పని చేయకపోవడం వెనుక గల కారణాలను వి.ఎన్. ఆదిత్య స్పష్టం చేశారు. “నాకు ప్రొఫెషనల్ ఇండిసిప్లిన్ ను తట్టుకోవడం కష్టం. నేను ఆయన్ని భరించలేను” అని ఆయన అన్నారు. ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడని అంగీకరించినప్పటికీ, ఆయన వ్యక్తిగతంగా నచ్చరని తెలిపారు. తాను కోరి ఎవరితోనూ పెట్టుకోనని, కానీ క్రమశిక్షణ లేని నటుడితో పని చేయడం తనలాంటి దర్శకులకు ఇబ్బందికరమని పేర్కొన్నారు.
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా
పెద్ద బడ్జెట్ చిత్రాలకు ప్రకాష్ రాజ్ షెడ్యూల్ సమస్యలు, అధిక రెమ్యునరేషన్ పట్టకపోవచ్చు గానీ, తన వంటి వారికి ఇవి పెద్ద విషయాలని ఆదిత్య వివరించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ కు ఒక అభిప్రాయం ఉన్నట్లే, ప్రకాష్ రాజ్ పై తనకు ఒక అభిప్రాయం ఉంటుందని ఆదిత్య పోల్చారు. అలాగే మా ఎన్నికల విషయంలో మంచు విష్ణు విజయం సాధిస్తారని తాను ముందుగానే ఊహించానని వి.ఎన్. ఆదిత్య తెలిపారు. నాగబాబు విలేకరుల సమావేశం చూసి ప్రకాష్ రాజ్ తప్పు నిర్ణయం తీసుకున్నారని తనకు ఆశ్చర్యం కలిగిందని ఆయన అన్నారు.
అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
అలాగే సినిమా అంటే తాను ప్రేక్షకులకు ఏదో చెప్పాలని తీయకుండా, వారిని ఎంగేజ్ చేయాలనే ప్రయత్నిస్తానని తన దర్శకత్వ శైలిని ఆదిత్య వివరించారు. “నువ్వు రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేసి ఏ పని చేయకు డిప్రెషన్ తోటి ఎండ్ అవుతది నీ లైఫ్” అని తన పెద్దాయన చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ, సినిమా రంగంలో ప్రయాణాన్ని ఆస్వాదించమని ఆయన యువతకు సూచించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ నటులపై తనకు చాలా గౌరవం ఉందని, వారిని చూస్తే ఇప్పటికీ అదే అభిమాన భావన కలుగుతుందని, కానీ పని చేసేటప్పుడు వృత్తిపరంగానే వ్యవహరిస్తానని వి.ఎన్. ఆదిత్య అన్నారు.
16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




