Ante Sundaraniki: ఐదేళ్ల క్రితం పుట్టిన కథ.. నవ్వులతోపాటు బలమైన ఎమోషనల్ స్టోరీ అంటే సుందరానికీ.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కామెంట్స్..

|

Jun 05, 2022 | 7:03 AM

నాని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఫన్ వుంటుంది. దాని వెనుక పెయిన్ వుంటుంది.

Ante Sundaraniki: ఐదేళ్ల క్రితం పుట్టిన కథ.. నవ్వులతోపాటు బలమైన ఎమోషనల్ స్టోరీ అంటే సుందరానికీ.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కామెంట్స్..
Vivek Athreya
Follow us on

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki).. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది నజ్రీయ. ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏గా రాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. అంటే సుందరానికీ మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇటీవల మీడియాతో ముచ్చటించారు.

వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. “అంటే సుందరానికీ అంటే కేవలం నవ్వించడమే కాదు అన్నీ రకాల ఎమోషన్స్ ఫీలౌతారు. ఎమోషనల్ గా కూడా చాలా బలమైన కంటెంట్ వుంటుంది. నాకు చాలా ఇష్టమైన నవల బారిష్టర్ పార్వతీశం. ఈ కథలో ఒక చిన్న ఎపిసోడ్ లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సంరంజామా పెడితే బావుంటుందనిపించి పెట్టాం. ఐతే దీనికి కథకి ఎలాంటి సంబంధం లేదు. ఐదేళ్ళ క్రితమే ఈ అంటే సుందరానికీ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్న. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే అనుకున్నాం. దీంతో నానిని సంప్రదించగా.. నాని గారు చాలా ఎక్సయిట్ అయ్యారు. చాలా నిజాయితీ గల కథ. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ వుండవు. చాలా హానెస్ట్ గా వుంటుంది.సంప్రదాయవాద సమాజం అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీని గురించి చర్చ వుండదు. ఐతే మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఇందులో వుంటుంది. ఐతే అది క్లాసులు పీకినట్లు వుండదు. పాత్రల నుండే సహజంగా వస్తుంది. ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు అవును కరక్టే కదా అని ప్రేక్షకులు ఫీలౌతారు.

నాని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఫన్ వుంటుంది. దాని వెనుక పెయిన్ వుంటుంది. ప్రతి మాట వెనుక భిన్నమైన లేయర్ వుంటుంది. ఐతే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత సులువు కాదు. నాని గారి ఫన్ గురించి చెప్పక్కర్లేదు. ఐతే ఇందులో ఖచ్చితంగా డిఫరెంట్ నానిని కొత్తగా చూడబోతున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.