AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైతూతో హ‌ర‌ర్ థ్రిల్ల‌ర్…క్లారిటీ ఇచ్చిన‌ విక్రమ్

అక్కినేని ఫ్యామిలీకి జీవితాంతం గుర్తిండిపోయే 'మ‌నం' సినిమా ఇచ్చాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు అదే ఫ్యామిలీ హీరో యువ‌సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి మ‌రోసారి ఓ సినిమా తెరకెక్కించనున్నారు.

చైతూతో హ‌ర‌ర్ థ్రిల్ల‌ర్...క్లారిటీ ఇచ్చిన‌ విక్రమ్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 08, 2020 | 4:42 PM

Share

అక్కినేని ఫ్యామిలీకి జీవితాంతం గుర్తిండిపోయే ‘మ‌నం’ సినిమా ఇచ్చాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు అదే ఫ్యామిలీ హీరో యువ‌సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి మ‌రోసారి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. లాక్​డౌన్​ ముగిసిన త‌ర్వాత ఈ ఫిల్మ్ షూటింగ్​ ప్రారంభం కానుంది.

ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుంచి మూవీపై అనేక గాసిప్స్ వినిపించాయి. గతంలో విక్రమ్ కే కుమార్ ​ తెరకెక్కించిన ’13 బి’ సీక్వెల్​గా హారర్​ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రానుంద‌ని వార్త‌లు వచ్చాయి​. అయితే, ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్. చైతన్యతో తీయ‌బోతున్న‌ సినిమా హారర్ థ్రిల్లర్​ కాదని స్పష్టం చేశారు. చైతూకి త‌గ్గట్టుగా మంచి రొమాంటిక్​ ఎంటర్​టైన్మెంట్​ తో రాబోతున్న‌ట్టు వివ‌రించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ష‌న్ లో ‘లవ్​స్టోరీ’ చేస్తున్నారు నాగచైతన్య. ఇది కంప్లీట్ అయిన తర్వాత ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్​తో కలిసి వ‌ర్క్ చేయ‌నున్నారు.