
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా మారుమోగుతున్న పేరు లక్కీ భాస్కర్. సామాన్యుడి జీవితంలోని కొన్ని అంశాలకు ఎమోషన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి జనాలు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో దుల్కర్ జోడిగా మీనాక్షి చౌదరి నటించగా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ క్రిటిక్స్. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ చిత్రానికి కలెక్షన్స్ మరింత రానున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభ రోజులను పంచుకున్నాడు. తన సినిమాకు ఒక్క రోజు పనిచేసిన వారి గురించి మర్చిపోకుండా చెప్పాడు. చంద్రశేఖర్ యేలేటి సినిమా కోసం తనను నటుడిగా డైరెక్టర్ హను ఆడిషన్ చేశారని.. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం శేఖర్ కమ్ముల ఆడిషన్ చేశాడని.. ఇప్పుడు తాము ముగ్గురం దుల్కర్ సల్మాన్ తో సినిమాలు చేసి హిట్స్ అందుకోవడం యాదృచ్చికమని..అందరం ఇలా ఒకే స్టేజ్ పై ఉంటామని ఎప్పుడూ అనుకోలేదంటూ గుర్తు చేస్తున్నాడు.
Venky Atluri
ఏబీసీడీ సినిమా చూసిన తర్వాత దుల్కర్ తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని.. కానీ అతడిని కలవడం కష్టమనుకున్నానని అన్నారు. ప్రొడ్యూసర్ స్వప్నాదత్ వల్ల ఈజీగానే కలిశానని.. కథ విన్న వెంటనే ఓకే చేశారని.. ఇక హీరోయిన్ మీనాక్షిని త్రివిక్రమ్, నాగవంశీ సజెస్ట్ చేశారని అన్నారు. సుమతి పాత్రకు ఆమె న్యాయం చేసిందని అన్నారు. వెంకీ అట్లూరి హీరోగా 2007లో జ్ఞాపకం అనే సినిమా చేశాడు. ఆ తర్వాత రచయితగా పనిచేస్తూ పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషించాడు.
ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్ను చూస్తే షాకవ్వాల్సిందే..
Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.