Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్.. అమ్మాయి ఎవరంటే..

|

Jun 09, 2024 | 6:56 AM

కోలీవుడ్ కమెడియన్.. మ్యుజిక్ కంపోజర్ ప్రేమ్‏జీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇందు అనే అమ్మాయితో జూన్ 9న తిరుత్తణి గుడిలో ఏడడుగులు వేశాడు. శనివారం రాత్రి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‏గా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఇందు అనే అమ్మాయి మెడలో మూడు మూళ్లు వేశాడు. ఈ విషయాన్ని ప్రేమ్‏జీ సోదరుడు.. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా బయటపెట్టాడు.

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్.. అమ్మాయి ఎవరంటే..
Premgi
Follow us on

కోలీవుడ్ కమెడియన్.. మ్యుజిక్ కంపోజర్ ప్రేమ్‏జీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇందు అనే అమ్మాయితో జూన్ 9న తిరుత్తణి గుడిలో ఏడడుగులు వేశాడు. శనివారం రాత్రి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‏గా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఇందు అనే అమ్మాయి మెడలో మూడు మూళ్లు వేశాడు. ఈ విషయాన్ని ప్రేమ్‏జీ సోదరుడు.. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా బయటపెట్టాడు. వీరిద్దరి పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చాలా రోజులుగా ప్రేమ్‏జీ పెళ్లి వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 45 ఏళ్ల వయసులో ప్రేమ్‏జీ వివాహం చేసుకోనున్నారనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కానీ ప్రేమ్‏జీ ఈ వార్తలపై రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు అతడి సోదరుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు నేరుగా ప్రేమ్‏జీ పెళ్లి ఫోటోస్ షేర్ చేసి కన్ఫార్మ్ చేశాడు.

ప్రేమ్‏జీ ప్రముఖ డైరెక్టర్, సంగీత విద్వాంసుడు గంగై అమరన్ కుమారుడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉన్న ప్రేమ్‏జీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వద్ద సహాయకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా మరారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో ప్రేమ్‏జీ చాలా వరకు ర్యాప్ సాంగ్స్ పాడారు. అళాగే సౌండ్ ట్రాక్ ఆల్బమ్స్ కోసం తన కంపోజిషన్‌లలో కొన్నింటిని రీమిక్స్ చేశాడు. 2006లో సిలంబరసన్ తెరకెక్కించిన వల్లవన్ చిత్రంలో కీలకపాత్ర పోషించి నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతడి సోదరుడు తెరకెక్కించిన చెన్నై 600028 చిత్రంలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా కమెడియన్ పాత్రలో
ప్రేమ్‏జీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమెడియన్ గా.. మ్యూజిక్ కంపోజర్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రేమ్‏జీ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రేమ్‏జీ పెళ్లి ఫోటోస్ నెట్టింట దర్శనమిచ్చాయి. వీరిద్దరి వివాహానికి యువ హీరోలు జై, వైభవ్ హాజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.