AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్.. అమ్మాయి ఎవరంటే..

కోలీవుడ్ కమెడియన్.. మ్యుజిక్ కంపోజర్ ప్రేమ్‏జీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇందు అనే అమ్మాయితో జూన్ 9న తిరుత్తణి గుడిలో ఏడడుగులు వేశాడు. శనివారం రాత్రి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‏గా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఇందు అనే అమ్మాయి మెడలో మూడు మూళ్లు వేశాడు. ఈ విషయాన్ని ప్రేమ్‏జీ సోదరుడు.. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా బయటపెట్టాడు.

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్.. అమ్మాయి ఎవరంటే..
Premgi
Rajitha Chanti
|

Updated on: Jun 09, 2024 | 6:56 AM

Share

కోలీవుడ్ కమెడియన్.. మ్యుజిక్ కంపోజర్ ప్రేమ్‏జీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇందు అనే అమ్మాయితో జూన్ 9న తిరుత్తణి గుడిలో ఏడడుగులు వేశాడు. శనివారం రాత్రి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‏గా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఇందు అనే అమ్మాయి మెడలో మూడు మూళ్లు వేశాడు. ఈ విషయాన్ని ప్రేమ్‏జీ సోదరుడు.. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా బయటపెట్టాడు. వీరిద్దరి పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చాలా రోజులుగా ప్రేమ్‏జీ పెళ్లి వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 45 ఏళ్ల వయసులో ప్రేమ్‏జీ వివాహం చేసుకోనున్నారనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కానీ ప్రేమ్‏జీ ఈ వార్తలపై రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు అతడి సోదరుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు నేరుగా ప్రేమ్‏జీ పెళ్లి ఫోటోస్ షేర్ చేసి కన్ఫార్మ్ చేశాడు.

ప్రేమ్‏జీ ప్రముఖ డైరెక్టర్, సంగీత విద్వాంసుడు గంగై అమరన్ కుమారుడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉన్న ప్రేమ్‏జీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వద్ద సహాయకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా మరారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో ప్రేమ్‏జీ చాలా వరకు ర్యాప్ సాంగ్స్ పాడారు. అళాగే సౌండ్ ట్రాక్ ఆల్బమ్స్ కోసం తన కంపోజిషన్‌లలో కొన్నింటిని రీమిక్స్ చేశాడు. 2006లో సిలంబరసన్ తెరకెక్కించిన వల్లవన్ చిత్రంలో కీలకపాత్ర పోషించి నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతడి సోదరుడు తెరకెక్కించిన చెన్నై 600028 చిత్రంలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా కమెడియన్ పాత్రలో ప్రేమ్‏జీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమెడియన్ గా.. మ్యూజిక్ కంపోజర్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రేమ్‏జీ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రేమ్‏జీ పెళ్లి ఫోటోస్ నెట్టింట దర్శనమిచ్చాయి. వీరిద్దరి వివాహానికి యువ హీరోలు జై, వైభవ్ హాజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి