
మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 1988 చివరిలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దర్శకుడు సముద్ర.. తొలుత ఈ.ఎమ్. రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత మోహన్ గాంధీ, ముత్యాల సుబ్బయ్య, బి. గోపాల్, శరత్, సురేష్ వర్మ లాంటి ప్రముఖ దర్శకులతో చేశారు. ముఖ్యంగా ముత్యాల సుబ్బయ్య దగ్గర పని చేస్తున్నప్పుడు చిరంజీవి హిట్లర్ సినిమా ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. హిట్లర్ మూవీ ముందు చిరంజీవికి సక్సెస్ అంతగా లేదని, వరుస ఫ్లాప్‌లతో సతమతమై.. ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనతో ఒక సంవత్సరం పాటు బ్రేక్ తీసుకున్నారని దర్శకుడు సముద్ర వివరించారు. ఈ గ్యాప్‌లో చిరంజీవి మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, మలయాళంలో మమ్ముట్టి నటించి విజయం సాధించిన ‘హిట్లర్’ లాంటి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ కథను ఎంచుకున్నారని తెలిపారు. ఎడిటర్ మోహన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయగా, చిరంజీవి స్వయంగా ఆసక్తి చూపించడంతో ఈ సినిమా ప్రారంభమైందన్నారు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
‘హిట్లర్’ షూటింగ్ సమయంలో చిరంజీవి సెట్లో అందరినీ గమనిస్తూ ఉండేవారని సముద్ర గుర్తు చేసుకున్నారు. తన పనితీరును చూసి చిరంజీవి ‘నువ్వు బాగా కష్టపడుతున్నావ్ సముద్ర, పైకొస్తావ్, డైరెక్టర్ అవుతావ్’ అని ఆశీర్వదించారని, ఆ ఆశీస్సులు తనకు కొండంత బలాన్నిచ్చాయని అన్నారు. సినిమాలోని ప్రతి అంశం పట్ల – ప్రొడక్షన్, సబ్జెక్ట్, డైలాగ్స్ ఇలా చిరంజీవికి అన్నింటిపైనా పూర్తి అవగాహన ఉండేదని, సమయం వృథా కాకుండా నిర్మాతలకు మద్దతుగా నిలిచేవారని తెలిపారు. ఉదయం 6:30 గంటలకు రెడీగా ఉంటానని, 7 గంటలకు షాట్ తీయాలని యూనిట్‌ను ప్రోత్సహించేవారని పేర్కొన్నారు.
ఇదే సినిమాకు డాన్స్ మాస్టర్ లారెన్స్‌ను పరిచయం చేసింది కూడా వి. సముద్రనే. లారెన్స్ అప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ఉండగా, చిరంజీవి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకుంటున్నట్టు తెలిసింది. అప్పుడే లారెన్స్‌కు చెప్పానని గుర్తు చేసుకున్నారు దర్శకుడు సముద్ర. శారద స్టూడియోలో ఎడిటర్ మోహన్ లారెన్స్‌ను పరిచయం చేయగా, ‘లబ్బీ బుల్లో’ పాట కోసం ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ మూమెంట్ చూపించమని చిరంజీవి కోరగా, లారెన్స్ తన సిగ్నేచర్ స్టైల్‌తో ఒక మూమెంట్‌ను చూపించాడు. అందుకు మెగాస్టార్ కూడా ఓకే చెప్పారు. అక్కడి నుంచి లారెన్స్ వెనుదిరిగి చూడలేదని, ఇప్పటికీ తనను చిరంజీవికి పరిచయం చేసింది సముద్ర అన్నే అని చెబుతాడని సముద్ర ఆనందంగా పంచుకున్నారు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..