వెంకీదే లేటు.. డేట్స్ ఇవ్వడం ఆలస్యం షూటింగ్ మొదలుపెట్టేస్తానంటున్న తరుణ్ భాస్కర్..
పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్ అయ్యాడు. ఆ మధ్య ఓ షోకి యాంకర్‌గానూ మారాడు.
Tharun Bhascker : ‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్ కూడా అయ్యాడు. ఆ మధ్య ఓ షోకి యాంకర్‌గానూ మారాడు. ఎన్ని పనులు చేసినా కథలు చెప్పడమే నా లక్ష్యం..డైరెక్షన్ నాధేయం అంటున్నాడు తరుణ్. ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకటేశ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. ఇప్పుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 2 సీకేవెల్ ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే తరుణ్ లాక్ డౌన్ లో కూడా వెంకీ కోసం స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ప్రారంభం చేద్దామని ప్లాన్ లో ఉన్నాడట. అప్పటివరకు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి డేట్స్ ఇవ్వగానే త్వరగా సినిమా చేయాలనీ భావిస్తున్నాడట. ఈ సినిమా కథ గుర్రపు స్వారీ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా అని వార్తలు వస్తున్నాయి. వెంకీ ఎఫ్ 3 పూర్తయిన వెంటనే తరుణ్ భాస్కర్ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actress Kriti Sanon : ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం చేస్తానంటున్న బ్యూటీ..